ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో భారీ నెగిటివిటీ తో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో రీతూ చౌదరి ఒకరు. మొదటి మూడు వారాలు ఈమె నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతాది అనే రేంజ్ కంటెస్టెంట్, చాలా తక్కువ ఓటింగ్ ఉండేది.
దానికి తోడు డిమోన్ పవన్ తో ప్రేమాయణం నడపడం కూడా ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. ఫైర్ స్ట్రోమ్స్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ కారణంగా ఈమె సేవ్ అయ్యింది. ఆరోజు ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం రీతూ చౌదరి ఎలిమినేట్ అవ్వాలి. కానీ ఆమెకు బదులుగా శ్రీజా ని అన్యాయంగా ఎలిమినేట్ చేశారు. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇదొక మాయని మచ్చ లాంటిది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తనకు వచ్చిన గోల్డెన్ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ రీతూ చౌదరి తన గేమ్ ని బాగా మెరుగుపరుచుకుంది.
ఫలితంగా ఆమెకు కొద్దీ వారాలు డీసెంట్ ఓటింగ్ పడుతూ వచ్చేది. అయితే ఈమె నామినేషన్స్ కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం గా ఎవరిని నామినేషన్స్ లోకి తీసుకొస్తే తానూ సేవ్ అవుతుందని బావిస్తుందో, వాళ్ళను నామినేషన్ లోకి తీసుకొస్తుంది. అంటే ప్రతీ వారం ఎలిమినేషన్ రౌండ్ లో ఉంటూ సేవ్ అయ్యే కంటెస్టెంట్ ని ఈమె నామినేషన్స్ లోకి తీసుకొచ్చేది. అలా వైల్డ్ కార్డ్స్ అందరినీ తనకు రక్షణ కవచం లాగా మార్చుకొని నామినేషన్స్ లోకి తీసుకొస్తూ అందరినీ ఇంటికి పంపేసింది. అలా ఒక్కసారి సంజన డేంజర్ జోన్ లోకి రావడం, ఎలాగో ఈమెకు తక్కువ ఓటింగ్ పడుతుంది కాబట్టి, ఆమెని నామినేట్ చేస్తూ వచ్చేది. దీంతో చిర్రెత్తిపోయిన సంజన రీతూ చౌదరి డిమోన్ పవన్ తో చేసే పనులను జనాలకు అర్థం అయ్యేలా, చాలా బోల్డ్ గా చెప్పడం మొదలు పెట్టింది.
సంజన చెప్పిన మాటలను ఫ్యామిలి ఆడియన్స్ కూడా సమర్దించారు, హౌస్ వీళ్లిద్దరు చేస్తున్నది అనే కదా ఫిక్స్ అయిపోయారు. ఇక అప్పటి నుండి రీతూ చౌదరి గ్రాఫ్ భారీగా పడిపోయింది , ఇప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే 13 వారాలు ఆమె హౌస్ లో కొనసాగినందుకు బిగ్ బాస్ టీం డబ్బులు ఈమెకు భారీగానే ఇచ్చింది. వారానికి రెండు లక్షల చొప్పున 13 వారాలకు గాను ఆమె 26 లక్షల రూపాయిలను రెమ్యూనరేషన్ గా అందుకుంది. అయితే ఒక్కటైతే నిజం, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు ఈమెకు ఎలాంటి నెగిటివిటీ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ బిగ్ బాస్ షో ద్వారా ఎంతో కొత్త నెగిటివిటీ ని ఆమె పోగొట్టుకుందనే చెప్పాలి. చూడాలి మరి భవిష్యత్తులో ఈమె ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయబోతుంది అనేది.

































