మనలో చాలామంది యోగా అనే పదం గురించి వినే ఉంటారు కానీ ఆ పదం అర్థం మాత్రం ఎక్కువమందికి తెలిసి ఉండదు. సంస్కృత పదం అయిన యజ్ నుండి యోగా అనే పదం పుట్టింది. యోగాకు జతకట్టడం, చేర్చడం, కలిసి ఉండటం అనే అర్థాలు వస్తాయి. సరైన పద్దతిలో యోగా చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. కొన్ని ఆసనాలు వేయడం ద్వారా 15 రోజుల్లో సులువుగా 12 కిలోల బరువు తగ్గవచ్చు.
యోగా మనసుకు స్థిరత్వాన్ని అందించడంతో పాటు ప్రశాంత జీవనాన్ని పొందడానికి కారణమవుతుంది. యోగాలో 30కు పైగా ఆసనాలు ఉండగా వయస్సును బట్టి చేసే ఆలోచనలలో మార్పులు ఉంటాయి. కొన్ని ఆసనాలు చేయడం ద్వారా బరువు సులువుగా తగ్గవచ్చు. బరువు తగ్గడానికి సూర్య నమస్కారాలు చేయడం ఉత్తమమని చెప్పవచ్చు. కండరాలను బలోపేతం చేసి జీవక్రియను పెంచి బరువు తగ్గించడంలో యోగా తోడ్పడుతుంది.
నడుము, తొడల దగ్గర కొవ్వు ఎక్కువగా ఉన్నవాళ్లు త్రికోణాసనం వేయాలి. పొత్తి కడుపును సాగదీసి జీర్ణక్రియను మెరుగుపరిచి జీవక్రియను పెంచడంలో ఇది ఉపయోగపడుతుంది. ఉత్కఠాసనం కేలరీలను బర్న్ చేసి బరువు తగ్గడంతో తోడ్పడుతుంది. ఈ ఆసనం వల్ల బరువు తగ్గవచ్చు. తల-పాద ఆసనం జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గిస్తుంది. సేతు బంధాసనం వేయడం వల్ల ఛాతీ, మెడ, వెన్ను బలోపేతం అవుతాయి.



































