బట్టతల.. యువతరానికి తీరని వేదన మిగుల్చుతుంది. చిన్నతనంలోనే బట్టతల కావడంతో అప్పుడే వృద్ధాప్యం వచ్చినట్టు ఆందోళన చెందుతేంటారు. ఆహారపు అలవాట్లు, విపరీతమైర కాలుష్యం, మానసిక ఆందోళనలు బట్టతలను తొందరగా తెచ్చిపెడుతాయని నిపుణులు అంటున్నారు.
కొంత మంది వెంట్రుకలు తలపై ఊడి పోకుండా రకరకాల మందులు, ప్రయత్నాలు చేస్తారు. కానీ వంశపారంపర్యంగా వచ్చే సమస్యల్లో బట్టతల ఒకటని ముందుగా గుర్తు పెట్టుకోవాలి. టీవీ ప్రకటనలు చూసి నూనెలు, మందులు, ఇంజక్షన్లు వాడినంత మాత్రాన జట్టు రాదు.
దీంతో కాలం గడిచేకొద్దీ, జుట్టు రాలిపోతూనే ఉంటుంది. ఫలితంగా అనతి కాలంలోనే బట్టతల దర్శనమిస్తుంది. అయితే ఇందుకు అరటి ఆకులు చక్కని పరిష్కారం చూపుతాయని నిపుణులు అంటున్నారు. అరటి ఆకులలో జుట్టుకు చాలా ప్రయోజనకరమైన పదార్థాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
ముందుగా ఒక అరటి ఆకు తీసుకుని బాగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అనంతరం అరటి ఆకును తలపై ఉంచి జుట్టు మూలాల వద్ద తేలికగా చేతులతో మసాజ్ చేయాలి. కొద్దిసేపు అలాగే మసాజ్ చేసి, ఆ తర్వాత కడగాలి. ఇలా చేస్తే వారం రోజుల్లోనే తలపై జుట్టు రాలడం ఆగిపోవడం మీరు చూస్తారు. చుండ్రు కూడా పోతుంది. మీ జుట్టు మూలాలు బలంగా మారుతాయి.
జుట్టుకు మాత్రమే కాదు. అరటి ఆకులు చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. అరటి ఆకులను శనగపిండిలో కలిపి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. వడదెబ్బకు వల్ల కమిలిపోయిన చర్మానికి ఇది చక్కని చికిత్స అందిస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.
































