మిగతా జానర్లతో పోల్చుకుంటే ఇప్పుడు హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ లకు బాగా ఆదరణ దక్కు తోంది. థియేటర్లతో పాటు, ఓటీటీలో కూడా ఈ లు ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సుమారు 140 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ కి IMDb 8.0/10 రేటింగ్ ఇవ్వడం విశేషం. ఇందుకు తగ్గట్టుగానే ఈ మూవీలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆనంద్, దివ్య అనే ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. వీరిది ఒక్కో కథ. ఆనంద్ లవ్ బ్రేక్ అప్ తో డ్రగ్ అడిక్ట్ గా మారుతాడు. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడానికి మత్తు పదార్థాలకి అలవాటు పడతాడు. మరో వైపు దివ్యకు బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్ అనే ఓ వింత సమస్య ఉంటుంది. దీనివల్ల ఆమె మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అయితే అనుకోకుండా వీరిద్దరికి పెళ్లి జరుగుతుంది. చూస్తుండగానే దివ్య ఒక బిడ్డకు జన్మనిస్తుంది.
అయితే ఆస్పత్రిలో ప్రసవమైన కొన్ని నిమిషాల్లోనే, తన బిడ్డను ఎవరో మార్చారని దివ్య అనుమానిస్తుంది. కానీ ఆమెకు ఉన్న జబ్బు దృష్ట్యా ఎవరూ తన మాటలను నమ్మరు. కానీ భర్త ఆనంద్ మాత్రం తన భార్య మాటలను నమ్మి, తన బిడ్డను కనిపెట్టేందుకు ప్రయత్నం చేస్తాడు. పోలీసు సాయంతో ఒక డీఎన్‌ఏ టెస్ట్ నిర్వహిస్తాడు. ఇందులో ప్రస్తుతం ఉన్న బిడ్డ వారిది కాదని తెలుస్తుంది. ఇక ఈ దర్యాప్తులో దిమ్మ తిరిగే నిజాలు బయట పడతాయి. పిల్లల దొంగతనం ఒక క్రైమ్ రింగ్‌లో భాగమని, ఇది ఆసుపత్రులలో పిల్లలను మార్చడం ద్వారా నడుస్తుందని తెలుస్తుంది. మరి ఆనంద్ తన బిడ్డ ఎక్కడ ఉందో కనిపెడతాడా ? పిల్లలని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు ? దీని వెనుక ఎవరున్నారు ? అనే విషయాలను ఈ ను చూసి తెలవసుకోవాల్సిందే.
ఈ ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు డీఎన్‌ఏ. గద్దల కొండ గణేష్ ఫేమ్ అథర్వ మురళి ఇందులో హీరోగా నటించాడు. ఇటీవలే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ త్వరలోనే జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది.