సుమారుగా 15-20 శాతం పెంపు ఉండే అవకాశం ఉంది. చివరిసారిగా 2024 లో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ సంస్థలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచాయి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL మాత్రం రీఛార్జ్ ప్లాన్లలో మార్పులు చేయలేదు.
కొత్త ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? :
అయితే జియోహాట్‌స్టార్ (Jiohotstar Recharge Plans) నుంచి కీలక ప్రకటన విడుదల అయింది. ప్లాన్ల ధరల్లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. సూపర్, ప్రీమియం ప్లాన్ ల ధరల్లో మాత్రమే మార్పులు చేసింది. కేవలం కొత్త యూజర్లకు మాత్రమే ఈ కొత్త ధరలు వర్తిస్తాయని తెలిపింది. జనవరి 28 నుంచి కొత్త ధరలు అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించింది.
రూ.79 రీఛార్జ్ ప్లాన్ :
జియోహాట్‌స్టార్ ప్లాన్ల మార్పులతోపాటు రూ.79 నెలవారీ ప్లాన్‌ను (JioHotstar Rs79 Recharge Plan) తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్ కేవలం కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదే మూడు నెలల ప్లాన్ ధర రూ.149 గా ఉంది. అదే సంవత్సరం ప్లాన్ ధర రూ.499 గా ఉంది. ఈ ప్లాన్లు కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
కొత్త ధరలు :
జియోహాట్‌స్టార్ సూపర్ వార్షిక ప్లాన్ ధర ప్రస్తుతం రూ.899 గా ఉండగా.. కొత్త యూజర్లు ఈ ప్లాన్‌ను రూ.1099 చెల్లించి, కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే ప్రీమియం వార్షిక ప్లాన్ ధర రూ.1499 నుంచి రూ.2199 ధరకు సవరించారు.
రూ.79, రూ.149, రూ.499 ప్లాన్లు :
జియోహాట్‌స్టార్ మొబైల్ యూజర్ల కోసం నెలవారీ సాధారణ ప్లాన్ ధర రూ.79 గా ఉంది. మూడు నెలల కోసం 149, వార్షిక రీఛార్జ్ ప్లాన్ ధర రూ.499 గా ఉంది. ఈ ప్లాన్ లో ఒకసారి ఒక మొబైల్ లోనే జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ను వినియోగించుకోవచ్చు.
సూపర్ ప్లాన్ల ధరలు :
జియోహాట్‌స్టార్ సూపర్ ప్లాన్ నెలవారీ ప్లాన్ ధర రూ.149 గా ఉంది. మూడు నెలల ప్లాన్ ధర రూ.349, వార్షిక ప్లాన్ ధర రూ.1099 గా ఉంది. ఒకేసారి రెండు డివైజ్ లలో కంటెంట్ ను వీక్షించవచ్చు. మొబైల్, వెబ్ సహా అన్ని రకాల కంటెంట్ ను వీక్షించేందుకు అవకాశం ఉంది.
ప్రీమియం రీఛార్జ్ ప్లాన్లు :
జియోహాట్‌స్టార్ ప్రీమియం నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.299 గా ఉంది. మూడు నెలల రీఛార్జ్ ప్లాన్ ధర రూ.699 గా ఉంది. అదే సంవత్సరం వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ ధర రూ.2199 గా ఉంది. ఈ యూజర్లు గరిష్ఠంగా 4 డివైజ్ లలో కంటెంట్‌ను వీక్షించవచ్చు. మొబైల్, వెబ్ సహా అన్ని రకాల కంటెంట్ ను వీక్షించవచ్చు.


































