నెంబర్ ప్లేట్ కు రూ. 1.17 కోట్లు.. అవును మీరు వింటున్నది నిజమే.. దేశంలోనే అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ గా ‘HR88B8888’ రికార్డు సృష్టించింది.
ఈ నెంబర్ ప్లేట్ ధర అక్షరాలా కోటీ 17 లక్షలు. సాధారణంగా నెంబర్ ప్లేట్ కు తక్కువ ధరే ఉంటుంది. అయితే చాలామంది తమకిష్టమైన నంబర్ కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడరు. రూ. లక్షలైనా పెడతారు. అయితే తాజాగా ఓ నెంబర్ ప్లేట్ ను ఏకంగా రూ.1 కోటీ 17 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ గా ‘HR88B8888’ ఇది రికార్డుల్లో నిలిచింది.
దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ గా రికార్డు సృష్టించింది. హరియాణాలో.. ఓ కారు నెంబర్ ప్లేట్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఈ వీఐపీ నంబర్ HR88B8888 ను ఆన్ లైన్ వేలంలో 1.17 కోట్లు ధరకు అమ్ముడైంది. హరియాణాలో ప్రతివారం వీఐపీ నంబర్ ప్లేట్ లను ఆన్ లైన్ లో వేలం వేశారు. ఈ వేలంలో దేశంలోనే రికార్డు స్థాయిలో HR88B8888 అనే నంబర్ రూ. 1.17 కోట్లకు అమ్ముడై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ వేలంలో 45 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. రూ. 50 వేల బేస్ ప్రైస్ తో ప్రారంభమైన ఈ నంబర్ ధర.. అలా పెరుగుతూ చివరికి రూ. 1.17 కోట్లకు అమ్ముడైంది.
హరియాణాలో ఆన్ లైన్ వేదికగా ప్రతివారం నిర్వహించే వేలంలో గత వారం ఓ కారు నెంబర్ ప్లేటు కూడా భారీ ధరకు అమ్ముడైంది. HR22W2222 అనే నంబర్ రూ. 37.91 లక్షలకు అమ్ముడుపోయింది. అయితే తాజాగా ఈ రికార్డుకు రెండింతలు రెట్లతో బద్దలు కొట్టింది. దేశంలోనే అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్ గా HR88B8888 నంబర్ రూ. 1.17 కోట్లకు అమ్ముడైంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ నెంబర్ కోసం అత్యధికంగా 45 మంది పోటీ పడ్డారు. రూ. 50 వేల ప్రారంభ ధర నుంచి.. అలా పెరుగుతూ చివరికి రూ. 1.17 కోట్లకు చేరుకుంది. అయితే ఈ నంబర్ ను ఎవరు కొనుగోలు చేశారన్నది తెలియాల్సి ఉంది.
ఇక హరియాణా ప్రభుత్వం ప్రతివారం fancy.parivahan.gov.in పోర్టల్ ద్వారా నంబర్స్ కు ఆన్ లైన్ వేదికగా వేలం నిర్వహిస్తుంది. అయితే HR88B8888 నంబర్ కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. ఈ నంబర్ లో వరుసగా 8 లు ఉన్నాయి. అలాగే B క్యాపిటల్ లెటర్ 8 ఆకారంలో ఉంటుంది. అది కూడా 8 ను పోలి ఉంటుంది. అలాగే నంబర్ లో వరుసగా ఉన్న 8 లు శుభప్రదంగా భావిస్తారు.
































