రోజూ సోడా తాగుతున్నారా? ఎంత అపాయమో తెలుసా?

సాధారణం ఆహారపు అలావాట్లు, శీతల పానియాల విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి. అయితే వేసవి కాలంలో ఎండ వేడి తట్టుకోలేక చాలా మంది కూల్ డ్రింక్స్, సోడాలు ఇతర శీతల పానియాలు తాగుతుంటారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

కొన్ని పానియాలు ఆరోగ్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని అనర్థాలకు దారి తీస్తుంటాయని నిపుణులు అంటున్నారు. ఇలాంటి వాటిలో సోడా ఒకటి. చాలా మంది ఆహారం జీర్ణం కాక సోడా తాగుతుంటారు. సోడా తాగాకా బ్రేవ్ మంటూ త్రేన్పు రాగానే ఎంతో రిలాక్స్ గా ఫీల్ అవుతుంటారు.. ఆహారం జీర్ణమైందని భావిస్తుంటారు. అయితే సోడా తాగడం ఒక అలవాటుగా మారితే మాత్రం డేంజర్లో పడ్డటే అంటున్నారు నిపుణులు.

దేశంలో చాలా మందికి సోడా తాగే అలవాటు ఉంది. సుష్టిగా భోజనం చేసిన తర్వాత కడుపులో ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా వెంటనే ఒక సోడా తాగాలనిపిస్తుంది. సోడా అందుబాటులో లేకుంటే కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం ప్రతిరోజూ సోడా తాగడం అలవాటుగా చేసుకుంటారు.. రాత్రి వరకు కడుపులో సోడా పడకుంటే ఎదో వెలితిగా బాధపడుతుంటారు. మరి అంతగా ఇష్టపడి తాగే సోడా ఆరోగ్యానికి మంచిదా? అంటే అస్సలు కాదని అంటున్నారు వైద్య నిపుణులు. సోడా తాగడం వల్ల అప్పటి వరకు ఉపశమనం కలిగినా.. దాని వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయని అంటున్నారు. ప్రతిరోజూ సోడా తాగడం వల్ల ప్రధానంగా కిడ్నీ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. సాఫ్ట్ డ్రింక్స్ తాగే వ్యక్తులు.. వాటిని కంటిన్యూగా తాగేవారు మూత్రపిండ వ్యాధి భారిన పడే ఛాన్స్ 20 శాతం ఉందని పరిశోదనలో తెలిందని అంటున్నారు. సోడాలో ఉండే ప్రిజర్వేటివ్ సోడియం బెజోయిట్ అనేది ఉపిరితిత్తులను దెబ్బతీస్తుందని అంటున్నారు.

ఆస్తమా ఉన్నవారు అస్సలు సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. సోడా తాగడం వల్ల ఆస్తమా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సోడాలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ అనేది శరీరం నుంచి కాల్షియంను బయటకు పంపిస్తుంది. దాని వల్ల ఎముకల్లో బలం తగ్గి ఎన్నో ఇబ్బందులు ఎదర్కొవాల్సి వస్తుంది. సోడా గ్యాస్ లో ఉండే ఆర్టిఫిషియల్ స్విట్నర్ వల్ల బరువు పెరిగే ఛాన్సు ఉంది. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల భారిన పడవొచ్చు. గుండె సంబంధిత వ్యాధులు కూడా రావొచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాదు సోడాతో ఉబకాయం, టైప్ 2 మధుమేహం, ఫ్యాటీ లివర్ మూత్ర పిండ వ్యాధి, కాలేయ వ్యాధి, పంటి నొప్పి లాంటి ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. ప్రతిరోజూ సాడా తాగితే కృత్రిమ స్వీటెనర్లు మెదడు కణాలు కూడా దెబ్బతీస్తాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సోడాలో బ్రామినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కలుపుతారు.. ఈ కెమికల్ కారణంగా చర్మంపై దురతలు, పొక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. నరాల బలహీనత వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే ప్రతిరోజూ సోడా తాగడం ప్రాణాలకు హానికరం.. ఆ అలవాటు తగ్గించుకుంటే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *