డీఎస్పీగా డ్రైవర్ కూతురు

మండలంలోని శానాయిపల్లి గ్రామానికి చెందిన మండ్ల కవిత రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది.


సాధారణ డ్రైవర్ పని చేసుకుంటున్న మండల నాగన్న వ్యవసాయ కూలీ అయిన భారతమ్మ దంపతుల రెండో కూతురు మండల కవిత చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడి చదువుతూ పట్టుదలతో ముందుకు సాగుతోంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ క్రమశిక్షణతో చదివి విద్యుత్ శాఖలో ఏఈగా ఉద్యోగం సాధించి నాగర్ కర్నూల్ పట్టణంలో విధులు నిర్వహిస్తోంది. ఇంకా సాధించాలనే పట్టుదల, ఉన్నత లక్ష్యంతో గ్రూప్-1 కు ప్రిపేర్ అవగా వచ్చిన ఫలితమే ఈ గొప్ప విజయం. కవిత ఎంపికతో శానాయిపల్లి గ్రామం, రేవల్లి మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. మండల యువత కవితను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ప్రజలు అభిప్రాయపడ్డారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.