రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అధికారులను ఆదేశించారు. వర్షాల పరిస్థితిపై సీఎస్ విజయానంద్, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
ఉత్తరాంధ్రలో పరిస్థితిని సీఎస్‌కు సీఎంకు వివరించారు. అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
”ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలి. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలి. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. ముందస్తు సన్నద్ధత, అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలి” అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
































