రేపటి నుంచి విద్యుత్తు ఉద్యోగుల సమ్మె

విద్యుత్తు ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సమ్మెలోకి వెళుతున్నామని విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్‌ ఎస్‌.కృష్ణయ్య ప్రకటించారు.


విద్యుత్తు సంస్థల యాజమాన్యంతో సోమవారం సాయంత్రం జరిగిన చర్చల్లో తమ డిమాండ్లపై స్పష్టత రాలేదని తెలిపారు. 29 డిమాండ్లను యాజమాన్యం ముందుంచగా, ప్రధాన అంశాలపై స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. స్పష్టత వచ్చేవరకు సమ్మెపై పునరాలోచన లేదని స్పష్టం చేశారు. మరోవైపు విజయవాడలోని గాంధీనగర్‌లో సోమవారం విద్యుత్‌ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో 15 వేల మందికి పైగా విద్యుత్‌ కార్మికులు పాల్గొన్నారు. కృష్ణయ్య మాట్లాడుతూ ఉద్యోగులపై యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. కన్వీనర్‌ఎం.వి.రాఘవరెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వం స్పందించకపోవడంతోనే సమ్మె బాట పడుతున్నామన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.