అకస్మాత్తుగా తల తిరిగినా .. కళ్ళ ముందు చీకటి ఏర్పడినా నిర్లక్షం వద్దు.. ఈ వ్యాధి లక్షణలు కావొచ్చు

www.mannamweb.com


ఒకొక్కసారి అకస్మాత్తుగా కనుల ముందు చీకటిగా మారి తల తిరిగినట్లు అనిపిస్తుంది. ఇలా జరగినప్పుడు నీరసంగా ఉందనో.. లేక షుగర్ లెవెల్ పెరగడమో లేదా తగ్గమో జరిగింది భావిస్తారు.

అయితే ఇలా అకస్మాత్తుగా తల తిరగడం, కనులు ముందు చీకటిగా మారడానికి కారణం.. మెదడులోని ఒక భాగానికి రక్త ప్రసరణ కొన్ని సెకన్లపాటు తగ్గిపోయినప్పుడు బ్లాక్ అవుట్ లేదా స్పృహ కోల్పోవడం జరుగుతుంది. న్యూరోలాజికల్ సమస్య ఉంటే ఇలా జరగవచ్చు.

గుండె జబ్బు లేదా గుండె నుండి మెదడుకు కనెక్షన్ ఉన్న రక్తనాళంలో రక్తం గడ్డకట్టినట్లయితే.. రక్త ప్రసరణ నిరోధించబడుతుంది. అలాంటి సమయంలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు.

కొన్నిసార్లు ఈ మైకము విపరీతమైన తల నొప్పి వలన సంభవించవచ్చు. మైగ్రేన్ సమస్యలు కూడా ఇలాంటి ప్రభావానికి కారణం అవుతాయి. జన్యుపరంగా కూడా ఈ వ్యాధి శరీరంలో గూడు కట్టుకోవచ్చు.

గుండెకు ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు తల తిరుగుతుంది. అంతేకాదు రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు కళ్లు చీకటిగా మారతాయి. పల్స్ ఆక్సిమీటర్ సాయంతో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను చెక్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. అందుకు ‘ఏబీజీ’ రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది.

ఎవరికైనా ఎప్పుడైనా హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు. ఆకస్మిక వణుకు, తల తిరగడం లేదా సమతుల్యత కోల్పోవడం కూడా స్ట్రోక్‌కి సంకేతాలు కావచ్చు. తలను తలకిందులుగా చేస్తే ఈ స్ట్రోక్ పక్షవాతానికి దారి తీస్తుంది.

బ్లడ్ షుగర్ సమస్య ఉంటే, బ్లడ్ షుగర్ లెవెల్ ఒక్కసారిగా తగ్గితే కళ్లు తిరగడం సమస్య కనిపిస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి.

మెదడులో రక్తప్రసరణ సమస్య ఏర్పడినా శరీరంలో రక్తపోటులో మార్పు వచ్చినా కళ్లు తిరగడం, కంటి ముందు చీకటి వంటి సమస్యలు కనిపిస్తాయి. ఎవరైనా హైపర్‌టెన్షన్‌తో బాధపడుతుంటే కూడా ఇలా జరగవచ్చు.