Eye Care: మీరు కళ్లజోడు వాడుతుంటారా? ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు.. కళ్లజోడు అవసరమే ఉండదు..!

కళ్లజోడు చాలామంది లైఫ్ స్టైల్ లో భాగం అయిపోయింది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ లు, కంప్యూటర్లు, టీవీల ముందు గంటలు గంటలు గడపడం వల్ల ఇప్పట్లో చిన్న పిల్లలకు కూడా దృష్టి లోపం సమస్యలు వచ్చి కళ్ల జోడు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కళ్లు మంట, కంటి చూపు తగ్గడం, కళ్లలో నీరు కారడం, కళ్లు పొడి బారడం వంటి సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కింది టిప్స్ ఫాలో అయితే కంటి చూపు మెరుగు పడటమే కాకుండా కళ్ల జోడు పెట్టుకునే అవసరం ఉండదు. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..


కళ్లు ఆర్పడం..

ల్యాప్టాప్, మొబైల్, టీవి, కంప్యూటర్ ఇలా ఏదైనా సరే.. స్క్రీన్ వైపు తదేకంగా చూడకూడదు. అప్పుడప్పుడు కనురెప్పలు ఆర్పుతూ ఉండాలి. కనీసం 2 సెకెన్ల పాటూ కళ్లు మూసుకుని ఆ తరువాత తెరవాలి. 5 సెకెన్ల పాటూ కనురెప్పలు మూయడం, తీయడం వేగంగా చేయాలి. ఇలా కనీసం రోజులో 5 నుండి 7 సార్లు చేస్తుంటే కంటి అలసట తొలగిపోయి కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.

వృత్తాకారం
కళ్లను వృత్తాకారంగా సవ్య దిశలోనూ, అపసవ్య దిశలోనూ తిప్పడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. రోజుకు రెండుసార్లు ఈ వ్యాయామం చేయకూడదు.

పామింగ్..

కంటిచూపు మెరుగు పరచడానికి పామింగ్ చక్కగా సహాయపడుతుంది. రెండు అరచేతులను కలిపి బాగా రుద్దాలి. అప్పుడు అరచేతులలో మంట పుడుతుంది. కొన్ని సెకెన్ల పాటూ ఈ వెచ్చని అరచేతులను కళ్లమీద ఉంచాలి. ఇలా రోజులో 5 నుండి 7 సార్లు చేస్తే కంటిచూపు మెరుగవుతుంది.

కళ్లను కడగాలి..

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కళ్ల మీద కాస్త గట్టిగా నీటిని చల్లుకోవాలి. రోజులో కనీసం 15 నుండి 20 సార్లు ఇలా నీటిని చల్లుకుంటే మంచిది. సూర్యదయానికంటే ముందు ఇలా చేయడం వల్ల చాలామేలు జరుగుతుంది.

ఆహారం..

కంటి చూపు మెరుగవ్వడానికి ఆహారం చాలా ముఖ్యం. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్-ఎ, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్, విటమిన్-సి, ఇ వంటి పోషకాలు తీసుకోవాలి