ఫాస్ట్ ఫుడ్ వ్యసనం 222 కిలోల బరువుకు దారితీస్తుంది..! ఆ చిన్న హాబీ!

రించలేని భారం అధిక బరువు. ఏటా చాలామంది యువత ఊబకాయం సమస్యలతో సతమతమవుతున్నారు. కొందరూ పట్టుదలతో బరువు తగ్గి స్ఫూర్తిగా నిలవగా మరికొందరూ సాధించలేక ఇబ్బందులు పడుతున్నారు.


ఇంతవరకు వందలు లేదా అంతకు మించి బరువు ఉన్నవారిని చూశాం. కానీ వాటన్నింటిని తలదన్నేలా ఏకంగా 222 కిలోల బరువు అంటే వామ్మో అనేస్తాం. పైగా అంత భారీకాయం ఉన్న వ్యక్తి తగ్గడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఈ వ్యక్తి సింపుల్‌గా తనికిష్టమైన హాబీతో తగ్గి చూపించి..శెభాష్‌ అనిపించుకుంటున్నాడు. అంత బరువు ఉండే వ్యక్తి ఎలా స్లిమ్‌గా మారాడో చూద్దామా..!.

అమెరికాలోని ఒహియోకు చెందిన 36 ఏళ్ల ర్యాన్ గ్రూవెల్ దాదాపు 222 కిలోల బరవు ఉండేవాడు. ఎన్ని కేలరీలు తీసుకుంటున్నాను అనేది పట్టించుకోకుండా నచ్చిన ఫుడ్‌ అమాంతం లాగించేసేవాడు. తనకిష్టమైనది ప్రతీది తినేయడం దానికి తోడు శారీరక శ్రమ లేకపోవడం కారణంగా అధిక బరువు సమస్యను ఎదుర్కొన్నాడు. తెలియకుండానే అలా ఫాస్ట్‌ ఫుడ్‌ తినడం అలవాటు చేసుకోవడంతో..అంత ఈజీగా దాన్ని వదిలించుకోలేకపోయాడు.

ఫలితంగా తానే విస్తుపోయేలా లావైపోయాడు. ఇక లాభం లేదనుకుని బరువు తగ్గే కార్యక్రమాలకు ఉపక్రమించాడు. వాకింగ్‌ చేయాలనుకుంటే..తన అధిక బరువు కారణంగా విపరితీమైన మోకాళ్ల నొప్పులు వేధించేవి. ఇక ఇలా కాదని..మే 6, 2023న సైకిల్‌ కొనుగోలు చేసి..సైక్లింగ్‌ చేయడం ప్రారంభించాడు.

ఆ హాబీ జీవితాన్నే మార్చేసింది..
ర్యాన్‌కి చిన్నప్పటి నుంచి సైక్లింగ్‌ మంచి హాబీ. సరదా..సరదాగా.. చేసే హాబీతో ఊహించని విధంగా 124 కిలోలకు తగ్గిపోయాడు. ర్యాన్‌ గణనీయమైన బరువు కోల్పోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దాంతోపాటు స్వీట్లు, ఆల్కహాల్‌, ఫాస్ట్‌ఫుడ్‌కి పూర్తిగా దూరంగా ఉన్నాడు. ఈ మేకి 90 కిలోలకు చేరాడు. ర్యాన్‌ కూడా ఇంతలా బరువు తగ్గుతానని అస్సలు ఊహించలేదంటూ సంబరపడుతున్నాడు.

అయితే తాను అనుకున్న లక్ష్యం ఇంకా చేరుకోలేదని..ఆరోగ్యకరమైన వ్యక్తిలా మంచి బరువు చేరుకునేదాక..తన వెయిట్‌ లాస్‌ జర్నీ ఆగదని ధీమాగా చెబుతున్నాడు. ఇక్కడ ర్యాన్‌ కథ చూస్తే..అసాధారణ బరువుని..జస్ట్‌ మనకు నచ్చిన అభిరుచితో ఎలా మాయం చేయొచ్చొ చెబుతోంది. అలానే అందరూ కూడా తాము చేయగలిగే వర్కౌట్లతో వెయిట్‌ లాస్‌కి ప్రయత్నిస్తే..విజయం తథ్యం అని నొక్కి చెప్పొచ్చు కదూ..!.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.