ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షల తుది షెడ్యూల్ విడుదల అయింది. గతంలో ఇచ్చిన టెంటేటివ్ షెడ్యూల్‌నే ఫైనల్ షెడ్యూల్‌గా ఖరారు చేస్తూ పరీక్షా విభాగం నేడు పాఠశాలలకు సమాచారం ఇచ్చింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్షల విభాగం డైరెక్టర్ ప్రకటన విడుదల చేశారు.
పదవతరగతి పరీక్షల షెడ్యూల్ ఇలా..
- మార్చి 16వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్.
- మార్చి 18వ తేదీన సెకండ్ లాంగ్వేజ్.
- మార్చి 20వ తేదీన ఇంగ్లీషు.
- మార్చి 23వ గణితం.
- మార్చి 25వ తేదీన ఫిజికల్ సైన్స్.
- మార్చి 28వ తేదీన బయోలాజికల్ సైన్స్.
- మార్చి 31వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు.



































