Fingerprints: ప్రతి వేలిముద్ర విభిన్నం కాదు!.. సంచలనంగా మారిన సరికొత్త అధ్యయనం

ఈ భూమండలం మీద ప్రతివ్యక్తి ప్రత్యేకమైన వేలిముద్రలను కలిగివుంటాడని చెబుతుంటారు. ఒకే వ్యక్తికి చెందిన ఒక వేలి ముద్ర మరో వేలు ముద్రతో సరిపోలదని అంటుంటారు.
అందుకే పోలీసులు కూడా కేసుల దర్యాప్తుల్లో నేరస్థుల గుర్తింపునకు వేలిముద్రలను కీలకంగా భావిస్తుంటారు. అయితే ఈ సిద్ధాంతం తప్పు అని కొలంబియా యూనివర్సిటీ తాజా అధ్యయనం సవాలు చేస్తోంది.


ప్రతి వేలిముద్ర ప్రత్యేకం కాదని చెబుతోంది. 60,000 వేలిముద్రలను విశ్లేషించి ఒక ప్రత్యేక వ్యక్తికి సంబంధించిన వాటిని మాత్రమే గుర్తించేలా ఒక ఏఐ ప్రోగ్రామ్‌కు (AI) శిక్షణ ఇవ్వగా.. సదరు వ్యక్తి వేలిముద్రలు 75-90 శాతం ఖచ్చితత్వంతో పోలి ఉన్నప్పుడు మాత్రమే ఏఐ వ్యవస్థ గుర్తించగలిగిందని అధ్యయనకారులు చెబుతున్నారు. ముఖాల గుర్తింపులో తరచుగా ఉపయోగించే డీప్ కాంట్రాస్టివ్ నెట్‌వర్క్‌గా పిలిచే ఏఐ విధానాన్ని శాస్త్రవేత్తలు వినియోగించారు. వేలిముద్రల విషయంలో చాలా కాలంగా ఆమోదయోగ్యంగా ఉన్న విషయాన్ని ఎత్తి చూపుతున్న ఈ రీసెర్చ్ ‘సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌’లో ఈ వారమే ప్రచురితమైంది.