ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్.. ఆ విషయాలపై స్పెషల్ ఫోకస్ చేసిన చంద్రబాబు..

Free bus scheme implementation in ap: దేశంలో కొన్ని రాష్ట్రాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణలో ఫ్రీబస్ ప్రయాణానికి మహిళల నుంచి మంచి ఆదరణ వస్తుంది.


దీన్ని చూపి ఏపీలో కూడా టీడీపీ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ చెప్పారు. ఈ క్రమంలో ఏపీలో దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

చంద్రబాబు తొందరలో ఏపీకి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వేళ ఫ్రీబస్సు ప్రయాణం జర్నీ ట్రెండింగ్ మారింది. దీనిపై ప్రజలు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో అని, మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో దీనిపై ఆర్టీసీపై ప్రభావం పడకుండా.. ఎలాంటి చర్యలు తీసుకొవచ్చో కూడా చంద్రబాబు నిశీతంగా చర్చలు జరిపారంట. ఉచిత బస్సు ప్రయాణాల వల్ల ఆటోవాలాల నుంచి వ్యతిరేకత రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొవాలనే దానిపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఆటోవాలాలు, జీబ్ ల వారికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపాధిని చూపెట్టగలం అనే దానిపై సమాచారం సేకరిస్తున్నారంట. మహిళలు బస్సు ప్రయాణం వల్ల.. ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకొవడంపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. మహిళలు పెద్ద ఎత్తున జర్నీలు చేస్తే, ఎలాంటి ఇబ్బందులు తలెత్తువచ్చు.. ఆయా మార్గాలలో రద్దీకి తగ్గట్టుగా బస్సుల ఏర్పాటు వంటి అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా ఆధార్ కార్డు చూపితే బస్సులలో ఫ్రీ జర్నీకి అనుమతించే విధానంపై ఆలోచిస్తున్నారు.