ఉద్యోగులకు ఉచితంగా రూ 1 కోటి భీమా – ఇలా చేస్తేనే అమలు

పీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు కొత్త వరం అందించింది. ఉద్యోగుల పై ఎలాంటి భారం లేకుండా రూ కోటి రూపాయల భీమా సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది.


ఏపీ ప్రభుత్వం ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఆ బ్యాంకులో శాలరీ ఖాతా ఉన్న ప్రతీ ఉద్యోగికి రూ కోటి ఉచిత భీమా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తాజాగా అమల్లోకి తెస్తూ ప్రభుత్వం చెల్లింపులు ప్రారంభించింది.

ఏపీ ప్రభుత్వం – స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో ‘స్టేట్‌ గవర్నమెంట్‌ శాలరీ ప్యాకేజీ’ అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్లు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకోసం ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత విధి నిర్వహణలో మృతిచెందిన పిచ్చేశ్వరరావుకు ముందుగా ఈ పరిహారం లభించింది. చెక్కు అందజేత సందర్భంగా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం భరోసానిచ్చారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందిన ఓ హెడ్‌ కానిస్టేబల్‌ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించింది. ఎక్సైజ్‌ శాఖ హెడ్‌ కానిస్టేబుల్‌ పిచ్చేశ్వరరావు ఈ ఏడాది జూలైలో ప్రమాదవశాత్తు మృతిచెందగా.. ఆయన కుటుంబానికి మొట్టమొదటగా రూ.కోటి బీమా పరిహారం అందింది.

తాజాగా హెడ్‌ కానిస్టేబుల్‌ భార్య వెంకటదుర్గకు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.కోటి చెక్కును అందజేశారు. ఈ పథకంలో భాగంగా ఇందులో శాశ్వత ఉద్యోగులు, శాఖలు అన్నీ ఇన్‌క్లూడ్ అవుతాయి. ప్రమాద మరణం జరిగితే మాత్రమే రూ.1 కోటి ఇస్తారు. అలా కాకుండా సహజ మరణం లేదా ఇతర కారణాలకు ఇది వర్తించదు. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు ఈ అకౌంట్‌ను ఓపెన్ చేసుకుంటున్నారు. ఎవరైనా ఇంకా ఓపెన్ చేసుకోకపోతే, వెంటనే బ్యాంకును సంప్రదించి, ప్రక్రియ ప్రారంభించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల కోసం ఖాతా ప్రారంభించేందుకు ప్రత్యేకంగా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఉద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం ద్వారా.. విపత్కర పరిస్థితుల్లో.. వారి కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించినట్లు అవుతుందని పేర్కొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.