ఎల్‌పీజీ నుంచి పన్ను వరకు.. డిసెంబర్‌ 1 నుంచి మారనున్న మార్పులు ఇవే

ఈ పనులకు గడువు నవంబర్ 30. అంతకు ముందే వాటిని పూర్తి చేయడం చాలా ముఖ్యం. కొత్త నెల ప్రారంభం కాగానే కొన్ని విషయాలలో నియమ నిబంధనలు మారుతూ ఉంటాయి. కొన్ని విషయాలు ఉపశమనం కలిగిస్తుంటే..

నవంబర్ ముగియనుంది. డిసెంబర్‌ నెల ప్రారంభం కానుంది. ఈ నెలాఖరుతో అనేక ముఖ్యమైన పనులకు గడువులు కూడా సమీపిస్తున్నాయి. ఈ పనులకు గడువు నవంబర్ 30. అంతకు ముందే వాటిని పూర్తి చేయడం చాలా ముఖ్యం. కొత్త నెల ప్రారంభం కాగానే కొన్ని విషయాలలో నియమ నిబంధనలు మారుతూ ఉంటాయి. కొన్ని విషయాలు ఉపశమనం కలిగిస్తుంటే.. మరికొన్ని ఆర్థికంగా ప్రభావం పడుతుంది. కొత్త నిబంధనలు సాధారణ ప్రజలకు సంబంధించినవే ఉంటాయి.


ఏకీకృత పెన్షన్ పథకం (UPS) గడువు తేదీ:

మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే, కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) కు మారాలనుకుంటే మీకు నవంబర్ 30 వరకు సమయం ఉంది. డిసెంబర్ 1 నుండి UPS ని ఎంచుకునే ఎంపిక నిలిపివేస్తారు. అందుకే NPS నుండి UPS కి మారాలనుకునే ఉద్యోగులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువును మొదట సెప్టెంబర్ 30గా నిర్ణయించారు. కానీ తరువాత నవంబర్ 30 వరకు పొడిగించారు.

టీడీఎస్‌ స్టేట్‌మెంట్‌ సమర్పించడానికి చివరి తేదీ:

అక్టోబర్ 2025లో మీ లావాదేవీలలో దేనిపైనైనా సెక్షన్ 194-IA, 194-IB, 194M, లేదా 194S కింద TDS తగ్గిస్తే సంబంధిత స్టేట్‌మెంట్‌ను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30. సకాలంలో సమర్పించడంలో విఫలమైతే జరిమానాలు, వడ్డీ రెండూ విధించవచ్చు.

ఎల్‌పిజి సిలిండర్ ధరలు:

ప్రతి నెలా మొదటి తేదీ మాదిరిగానే కొత్త LPG సిలిండర్ ధరలు డిసెంబర్ 1న అమలులోకి వస్తాయి. నవంబర్ 1న, OMCలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.6.50 వరకు తగ్గించాయి. డిసెంబర్‌లో ధరలు మరింత పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

విమాన టికెట్ల ధరల్లో మార్పులు:

ప్రతి నెలా మొదటి తేదీన ATF (ఏవియేషన్ టర్బైన్ ఇంధనం) ధర కూడా సవరిస్తుంటుంది. డిసెంబర్‌లో ATF ఖరీదైనది అయితే, విమాన టిక్కెట్లు కూడా పెరగవచ్చు. ఇది చౌకగా మారితే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించవచ్చు.

ఐటీఆర్‌ దాఖలుకు చివరి తేదీ:

సెక్షన్ 92E కింద పత్రాలను సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారులకు నవంబర్ 30 కూడా చివరి తేదీ. మీ వ్యాపారం లేదా ఆదాయం అంతర్జాతీయ లావాదేవీలను కలిగి ఉంటే మీ ITR దాఖలును ఆలస్యం చేయడం వలన గణనీయమైన నష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. పన్ను పత్రాలను దాఖలు చేసినా, పెన్షన్లను అప్‌డేట్‌ చేసినా లేదా ప్రభుత్వ పథకాన్ని ఎంచుకున్నా, నవంబర్ 30 అన్ని పనులకు సాధారణ గడువు. ఈ గడువు ముగిసిన తర్వాత డిసెంబర్ 1 నుండి చాలా పనులు పనిచేయడం ఆగిపోతాయి. అప్పుడు మీకు జరిమానా విధించవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.