ఇకపై ప్రతి మారుతీ కారుకు సన్‌రూఫ్.. ముఖ్యంగా ఈ కార్లకే, అవేంటో చూసేయండి

భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి తనకంటూ ఓ బేస్ క్రియేట్ చేసుకుంది. చౌకైన కార్ల నుంచి లగ్జరీ కార్ల వరకు అందుబాటులోకి తీసుకొచ్చింది.


అన్ని తరగతుల వినియోగదారులకు అనుగుణంగా కార్లను విడుదల చేస్తోంది. ఈ ఏడాది అద్భుతమైన కార్లను తీసుకురాగా, 2026లో అదిరిపోయే లైనప్ ను విడుదల చేయడానికి ప్రయత్నిస్తోంది. వచ్చే కార్లు అన్నింటికీ సన్ రూఫ్ తీసుకురావాలని భావిస్తోది. అయితే, ప్రస్తుతం మారుతి సుజుకి నుంచి అందుబాటులో ఉన్న సన్‌ రూఫ్ ఉన్న కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించి 5 మోడల్స్‌ లో సన్‌ రూఫ్ ఫీచర్ అందిస్తోంది. ముఖ్యంగా టాప్ వేరియంట్లలో ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఇవి సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ లేదంటే పనోరమిక్ సన్‌ రూఫ్ తో వస్తున్నాయి.

⦿ మారుతి డిజైర్ (Dzire) – కాంపాక్ట్ సెడాన్

సన్‌రూఫ్: టాప్ ZXi+ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది.

ధర: సన్‌రూఫ్ వేరియంట్ రూ. 9.3 లక్షలు ఉంటుంది.

ఇతర వివరాలు: 1.2L పెట్రోల్ ఇంజన్, 23-24 kmpl మైలేజ్, 6 ఎయిర్‌ బ్యాగ్స్, టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ తో వస్తుంది.

⦿ మారుతి బ్రెజ్జా (Brezza) – సబ్ కాంపాక్ట్ SUV

సన్‌రూఫ్: ZXi, ZXi+ వేరియంట్లలో లభిస్తుంది.

ధర: సన్‌రూఫ్ వేరియంట్లు రూ. 11 – 13 లక్షల్లో అందుబాటులో ఉన్నాయి.

ఇతర వివరాలు: 1.5L పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్, 360° కెమెరా, హెడ్స్ అప్ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది.

⦿ మారుతి ఫ్రాంక్స్ (Fronx) – క్రాస్‌ఓవర్ SUV

సన్‌ రూఫ్: టాప్ టర్బో వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.

ధర: సన్‌ రూఫ్ వేరియంట్లు రూ. 11 – 12 లక్షల్లో అందుబాటులో ఉన్నాయి.

ఇతర వివరాలు: 1.0L టర్బో, 1.2L పెట్రోల్, HUD, వైర్‌ లెస్ చార్జింగ్, 9 ఇంచ్ టచ్‌ స్క్రీన్ అందుబాటులో ఉంటుంది.

⦿ మారుతి గ్రాండ్ విటారా (Grand Vitara) – కాంపాక్ట్ SUV

సన్‌రూఫ్: టాప్ వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది. రియర్ పేన్ కూడా ఓపెన్ అవుతుంది.

ధర: సన్‌రూఫ్ వేరియంట్లు రూ. 15 – 20 లక్షల్లో అందుబాటులో ఉంది.

ఇతర వివరాలు: స్ట్రాంగ్ హైబ్రిడ్ (27+ kmpl), AWD ఆప్షన్, వెంటిలేటెడ్ సీట్స్ తో వస్తుంది.

⦿ మారుతి విక్టోరిస్ (Victoris), ఇన్విక్టో (Invicto) – మిడ్‌సైజ్ SUV/MPV

సన్‌రూఫ్: టాప్ వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది.

ధర: విక్టోరిస్ రూ. 15 – 20 లక్షలు, ఇన్విక్టో రూ. 25 – 29 లక్షల్లో అందుబాటులో ఉంటుంది.

ఇతర వివరాలు: హైబ్రిడ్ టెక్, ప్రీమియం ఫీచర్లు, వెంటిలేటెడ్ సీట్స్, ADAS ఉంటాయి.

ఈ ధరలు డిసెంబర్ 2025కు సంబంధించి కంపెనీ అధికారిక వివరాల ప్రకారం తీసుకోబడింది. సగటు ఎక్స్-షోరూమ్, ఆఫర్లు, టాక్స్ ను బట్టి మారే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాల కోసం దగ్గర లోని మారుతి సుజుకి షో రూమ్ ను సంప్రదించడం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.