“ఫంక్షన్స్ స్టైల్ పాలకూర పప్పు” – దీన్ని ఇంట్లో తయారు చేసుకుంటే, పెళ్లి భోజనంలో తిన్నంత రుచిగా ఉంటుంది.

మనలో చాలా మందికి పెళ్లిళ్లు, ఫంక్షన్స్​లో వడ్డించే కమ్మని పాలకూర పప్పు ఎంతో ఇష్టం. ఎన్ని కూరలు వడ్డించినా రెండు గరిటెలు పప్పు అడిగి మరీ వేసుకొని అన్నం తృప్తిగా తింటాం. ఎక్కువ మంది ఇంట్లో ఎంత బాగా చేసినా అచ్చం ఫంక్షన్స్​లో చేసే రుచి మాత్రం రాదు. అయితే, ఇక్కడ చెప్పిన విధంగా ఓసారి పాలకూర పప్పు ట్రై చేయండి. టేస్ట్​ పెళ్లి భోజనానికి ఏమాత్రం తీసిపోదు. ఇంట్లో అందరూ ఎంతో బాగా చేశావు అని పొగడ్తలతో ముంచెత్తుతారు. మరి పాలకూరపప్పు రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.


కావాల్సిన పదార్థాలు

  • కందిపప్పు – కప్పు (150 గ్రాములు)
  • పాలకూర – 4 కట్టలు
  • కరివేపాకు – 2
  • పసుపు – పావు టీస్పూన్
  • నూనె – సరిపడా
  • పచ్చిమిర్చి – 10
  • పొట్టు తీసిన వెల్లుల్లి – 15
  • టీస్పూన్ – జీలకర్ర
  • ఆవాలు – అరటీస్పూన్
  • ఎండుమిర్చి – 2
  • పావుటీస్పూన్ – ఇంగువ
  • ఉల్లిపాయ – 1
  • పావు కప్పు – చింతపండు రసం
  • 2 టేబుల్​స్పూన్లు – నెయ్యి
  • పాలకూర పప్పు తయారీ విధానం

    • ముందుగా ఒక బౌల్లో కప్పు కందిపప్పు తీసుకొని రెండుమూడుసార్లు శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి అరగంటపాటు నానబెట్టుకోవాలి.
    • ఈలోపు పాలకూర శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
    • అనంతరం కందిపప్పు కుక్కర్లోకి తీసుకోండి. ఇందులో ఒకటిన్నర గ్లాసులు వాటర్​, పావు టీస్పూన్ పసుపు, 2 కరివేపాకు, 2 టీస్పూన్లు నూనె వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో 3 విజిల్స్​ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
    • కుక్కర్లో ఆవిరి పోయిన తర్వాత మూత తీసి గరిటెతో మెదుపుకోవాలి.
    • ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి, అరటీస్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయండి. ఈ పచ్చిమిర్చి-వెల్లుల్లి పేస్ట్ వేస్తే పాలకూర పప్పు రుచి అద్భుతంగా ఉంటుంది.
    • స్టవ్​పై పాన్​ పెట్టి 3 టేబుల్​స్పూన్లు ఆయిల్ వేసి హీట్ చేయండి. వేడివేడి నూనెలో అరటీస్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పావు టీస్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేయండి. ఆపై ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి ఫ్రై చేయండి.
  • ఆనియన్స్​ కాస్త రంగు మారిన తర్వాత పాలకూర వేసి 2 నిమిషాలపాటు ఫ్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి-వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేయండి.
  • అనంతరం ముందుగా ఉడికించుకున్న పప్పు వేసి బాగా కలపండి. అలాగే పావు కప్పు చింతపండు రసం వేసి కలపండి. ఈ పప్పుని మీడియం ఫ్లేమ్​లో 6-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

చివరిగా ఇందులో 2 టేబుల్​స్పూన్లు నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకుంటే టేస్టీ పాలకూర పప్పు మీ ముందుంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.