నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. గత కొద్ది నెలలుగా స్థిరంగా ఉంటున్న గ్యాస్ సిలిండర్ ధరలను (Gas cylinder prices) ఆయిల్ కంపెనీలు భారీగా పెంచాయి.
నూతన సంవత్సర వేళ వాణిజ్య గ్యాస్ సిలిండర్ (Commercial gas cylinder) ధరలు పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరను రూ. 111 పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1691.50 కి చేరుకుంది.
అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో డిసెంబర్ వరకు 1595.50కి లభించగా.. పెరిగిన ధరతో రూ. 1706. 50 లకు ధరకు అందుబాటులో ఉంది. కేవలం కమర్షియల్ సిలిండర్లనే కాకుండా, 5 కిలోల ఎఫ్‌టిఎల్ (FTL) సిలిండర్ల ధరను కూడా రూ. 27 పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. అయితే గృహ వినియోగ (Domestic) ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మాత్రం ఆయిల్ కంపెనీలు ఎటువంటి మార్పు చేయలేదు. కాగా నూతన సంవత్సర ప్రారంభంలోనే వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులపై అదనపు భారం పడింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదారాబాద్: రూ.905
వరంగల్: రూ.924
విశాఖపట్నం: రూ.861
విజయవాడ: రూ.875
గుంటూరు: రూ. 877



































