సముద్రం ఒడ్డున చనిపోయిన గాడ్స్‌ ఫిష్‌.. ప్రపంచ వినాశానికి సంకేతమా..?

www.mannamweb.com


సాధారణంగా సముద్రంలో లక్షలాది చేప జాతులు కనిపిస్తాయి.. కానీ గాడ్స్ ఫిష్ అని పిలిచే ఈ చేప పేరులోనే కాకుండా ఆకారంలోనూ వింతగా ఉంటుంది. అంతేకాదు..

ఈ చేప ఎంతో అరుదుగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చేప కనిపిస్తే సునామీ, వరదలు వంటి విపత్తులు సంభవిస్తాయని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ చేప మృత దేహం సముద్రం ఒడ్డున దర్శనమివ్వడంతో ఇదేదో పెద్ద సంఘటనకు సంకేతమని జనాలు ఆందోళనలో పడ్డారు. చనిపోయిన చేపలను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

ఈ చేప పేరు డూమ్స్‌డే, ప్రపంచంలోని అరుదైన చేపలలో ఒకటి, ఈ చేపను ఫిష్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు. వింత ఆకారంలో ఉండే ఈ చేప మిగతా చేపలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఇది చాలా అరుదైన చేప. ఇది 12 అడుగుల పొడవుతో ఉంటుంది. సుమారు 30 అడుగుల వరకు పెరుగుతుంది. పెద్ద కళ్ళు, దాని తలపై ఎర్రటి కుచ్చు ఉంటుంది. సాధారణంగా ఈ చేప సునామీలు, వరదలు వంటి విపత్తులను అంచనా వేస్తుంది. ఈ చేప కనిపిస్తే ఇలాంటివి జరుగుతాయని ప్రజల నమ్మకం. అలాంటిది ఈ చేప సముద్ర తీరంలో చనిపోయింది. దీంతో ఇప్పుడు ప్రజల్లో ఆందోళన మొదలైంది.

ఈ చేపలు కనిపించడం వినాశనానికి సంకేతమని సాధారణంగా నమ్ముతారు. 2011లో జపాన్‌లో భూకంపం రావడానికి ముందు, ఒడ్డున తేలుతున్న 20 ఓర్‌ఫిష్‌ల ద్వారా భూకంపం వస్తుందని అంచనా వేశారు. భూకంపానికి ముందు, ఈ చేపలు సముద్రం ఒడ్డుకు తేలాయి. దాంతో భారీ విధ్వంసం జరిగింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సముద్రం ఒడ్డున ఈ చేప చనిపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు, సముద్రం ఒడ్డున చచ్చిపడివున్న ఈ చేపలను చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన ప్రజలలో తీవ్ర ఆందోళనను సృష్టించింది. ఏం జరగబోతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.