భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు

గురువారం వెండి ధర కిలోకు సుమారు రూ.19,000 తగ్గి రూ.2.99 లక్షలకు చేరింది. బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.3,099 తగ్గి రూ.1.51 లక్షలకు వచ్చింది.

ఇటీవల భారీ పెరుగుదల తర్వాత లాభాల బుకింగ్, స్టాక్ మార్కెట్ ర్యాలీ, భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. కొత్త పెట్టుబడిదారులు కొంతకాలం వేచి చూడాలని సూచిస్తున్నారు. 2025లో బంగారం 75 శాతం, వెండి 167 శాతం పెరిగాయి.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.