కర్నూలు జిల్లాలో 1500 ఎకరాల్లో బంగారం నిక్షేపాలు.. త్వరలో వెలికితీత

కర్నూలు జిల్లా(Kurnool)లో1500 ఎకరాల్లో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిల్వలను వెలికితీసేందుకు పరిశోధన సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.


జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి ప్రాంతంలో బంగారం నిల్వలు ఉన్నట్లు జియోలాకల్ సర్వే ఆఫ్ ఇండియా(Geolocal Survey of India) గతంలోనే గుర్తించింది. ఈ మేరకు బంగారం వెలికితీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చాయి. అతి త్వరలోనే బంగారం నిల్వలను బయటకు తీయబోతున్నారు. రైతుల సహకారంతో ఈ ప్రాంతంలో పలు సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి.

ఇప్పటికే విదేశీ సంస్థలు పరిశోధనలు కూడా చేశాయి. జియో మైసూర్ అనే సంస్థ పరిశోధనలు చేసింది. ఇందుకోసం తుగ్గలి మండలంలో దాదాపు 599 హెక్టార్ల భూములను లీజుకు తీసుకుని డ్రిల్లీంగ్ కొనసాగించాయి. కోర్ ట్రెల్లింగ్ ద్వారా రాళ్లను వెలికి తీసి పొడి చేసి బెంగళూరులోని ల్యాబ్‌కు తరలించారు. భూగర్భంలో 180 మీటర్ల లోతులో నిక్షేపాలు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. డ్రిల్లింగ్ చేసి శ్యాంపిల్స్ సేకరించి ప్రయోగశాలకు పంపి పరీక్షించారు. ఈ మేరకు ఎకరాకు రూ.16, 500 చొప్పున రైతులకు కౌలు చెల్లించారు. ఈ ప్రాంతంలో పరిశోధనలు జరిపేందుకు 2043 వరకు అనుమతులు ఉన్నాయి. ఇక బంగారం నిల్వలను బయటకు తీసేందుకు సిద్ధమవుతున్నారు. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైనింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. రాళ్లసీమ స్వర్ణ సీమ కాబోతోంది. కరువు సీమలో నుంచి కనకం బయటకు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉందని పలువురు అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.