బంగారం ధర భారీగా పడిపోయే అవకాశం…ఒక తులం పసిడి ఏకంగా రూ. 30,000 తగ్గే ఛాన్స్

బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగిపోయింది. బంగారం ధర పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనివిధంగా పెరగడానికి డాలర్ విలువ పతనం ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.


అమెరికా ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా ఒక ఔన్స్ బంగారం విలువ 3700 డాలర్ల ఎగువకు చేరుకుంది. బంగారం ధర భారీగా పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర గడచిన ఏడాదికాలంగా గమనించినట్లయితే దాదాపు 40 శాతం పెరిగింది, 20 సంవత్సరాలుగా బంగారం ధరలను చూసినట్లయితే సరిగా 2005వ సంవత్సరంలో బంగారం ధర కేవలం 5000 – 7000 రూపాయల మధ్యలో ఉంది. అక్కడ నుంచి బంగారం ధర ఏకంగా 1.15 లక్షల రూపాయలకు చేరుకుంది. అంటే దాదాపు 25 రెట్లు బంగారం ధర పెరిగినట్లు గమనించవచ్చు.

బంగారం ధర పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారాన్ని సురక్షితమైనటువంటి పెట్టుబడి సాధనంగా భావిస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకున్నట్లు చెప్పవచ్చు. బంగారం ధర భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి చాలా కష్టతరంగా ఉన్నప్పటికీ, బంగారంలో పెట్టుబడి పెట్టే వారికి మాత్రం పెరుగుతున్న లాభాలు మంచి లాభాలను అందిస్తున్నాయని చెప్పవచ్చు.

బంగారు ఆభరణాల ధరలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహాలు చాలామందికి వస్తున్నాయి. అయితే దాని కన్నా ముందు అసలు బంగారం ధర ఎందుకు పెరిగింది అనే అంశంపైన దానికి ఫాలో అంశాలను ఇప్పుడే మనం తెలుసుకున్నాం. అయితే బంగారం ధర తగ్గడానికి దారి తీసే కారణాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బంగారం ధర తగ్గడానికి దారి తీసే కారణాలు ఇవే..
బంగారం ధర తగ్గడానికి ప్రధానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదుటపడినట్లయితే బంగారం ధర తగ్గే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా డాలర్ విలువ ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి బలపడినట్లయితే బంగారం విలువ క్రమంగా తగ్గే అవకాశం ఉన్నటువంటి నిపుణులు పేర్కొంటున్నారు.

దీంతో పాటు సెంట్రల్ బ్యాంకులు సైతం బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం బంగారం ఓవర్ బాట్ పొజిషన్ కు చేరుకుందని నిపుణులు పేర్కొంటున్నారు ఈ స్థాయి నుంచి పెరగడం కష్టమని, స్టాక్ మార్కెట్ పొందుకున్నట్లైతే బంగారం ధరలు తగ్గిపోయే అవకాశం ఉందని కూడా పేర్కొంటున్నారు. అయితే బంగారం ధర తగ్గి రావాలంటే స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా సద్దుమణిగినట్లయితే బంగారం ధర తగ్గే అవకాశం ఉంది.

Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.