భారీగా పడిపోతున్న బంగారం ధర… జనవరి 2వ తేదీ, శుక్రవారం బంగారం ధరలు ఇవే

బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్లు చూడవచ్చు. పసిడి ధరలు భారీగా తగ్గుతున్నాయి. జనవరి రెండవ తేదీ శుక్రవారం పసిడి ధరలు ఇలా ఉన్నాయి.


24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,320 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,200 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 2,36,498 పలుకుతోంది. బంగారం ధర గతవారంతో పోల్చి చూస్తే ఈ వారం తగ్గడం గమనించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు తగ్గడం మనం గమనించవచ్చు.

ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఒక ఔన్స్ (31.2 గ్రాములు) 4,339 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గతవారం 4550 డాలర్ల ఎగువన బంగారం ధర ట్రేడ్ అయింది. అక్కడి నుంచి దాదాపు 200 డాలర్లు బంగారం ధర తగ్గినట్లు గమనించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర తగ్గడానికి ప్రధానంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పైన లాభాలను బుక్ చేసుకోవడమే కారణం అని చెబుతున్నారు.

ఈ ఏడాది మొదటి రోజు అయిన జనవరి ఒకటో తేదీ నుంచి బంగారం ధరలు తగ్గడం మొదలుపెట్టాయి. గత ఎడాది గమనించినట్లయితే బంగారం ధర ఏకంగా 70% పెరిగినట్లు చూడవచ్చు. బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం డాలర్ విలువ తగ్గడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు 2026 అంటే ఈ సంవత్సరం కూడా బంగారం ధర బుల్లిష్ గానే ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి సంస్థలు చెబుతున్నాయి.

అయితే మరోవైపు ప్రస్తుతం బంగారం ధరలు మాత్రం స్వల్పంగా కరెక్షన్ గురవుతున్నట్లు చూడవచ్చు. ఇదిలా ఉంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ ధరలను కనుక భవిష్యత్తులో తగ్గించినట్లయితే బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ నెలలో జరిగిన ఫెడరల్ రిజర్వు సమావేశంలో వడ్డీ ధరలు 0.25% చొప్పున తగ్గించారు. దీంతో ఒక్కసారిగా బంగారం ధర భారీగా పెరగడం చూడవచ్చు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గినప్పుడు డాలర్ విలువ తగ్గుతుందని, అప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల నుంచి బయటకు తీసి బంగారం లాంటి సేఫ్ పెట్టుబడులలో ఇన్వెస్ట్ చేస్తారని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు బంగారానికి డిమాండ్ పెరిగి ధర భారీగా పెరుగుతుంది.

ఇక మరోవైపు చూసినట్లయితే వెండి ధర కూడా భారీగా తగ్గినట్లు చూడవచ్చు. వెండి ధర ప్రస్తుతం ఒక కేజీ 2.30 లక్షల రూపాయల ఎగువన ట్రేడ్ అవుతోంది. గతంలో ఇది 2.50 లక్షల రూపాయలు దాటి ముందుకు వెళ్ళింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.