Gold Rate: గుడ్‌న్యూస్.. నింగి నుంచి నేలకు పసిడి ధర.. నేడు రూ.20,800 తగ్గిన గోల్డ్ రేటు

Gold Price Today: పసిడి ప్రియులు అస్సలు ఊహించని స్థాయిలో బంగారం ధరలు నేడు అనూహ్యంగా కిందకు జారిపడ్డాయి. దాదాపు మూడు నెలలుగా భారీగా పెరుగుదలను కలిగి ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులోకి వస్తుండటంతో పెళ్లిళ్ల సీజన్ ముందు కొనుగోలుదారులు వెంటనే షాపింగ్ చేసేందుకు పరుగులు తీస్తున్నారు.


22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.19,000 భారీ క్షీణతను నమోదు చేశాయి. ఇదే క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.6,650, ముంబైలో రూ.6,570, దిల్లీలో రూ.6,585, కలకత్తాలో రూ.6,570, బెంగళూరులో రూ.6,570, కేరళలో రూ.6,570, వడోదరలో రూ.6,575, జైపూరులో రూ.6,585, నాశిక్ లో రూ.6,573, మంగళూరులో రూ.6,570, అయోధ్యలో రూ.6,585, బళ్లారిలో రూ.6,570, గురుగ్రాములో రూ.6,585 వద్ద కొనసాగుతున్నాయి.

24 క్యారెట్ల గోల్డ్ ధరలు నేడు నింగి నుంచి ఒక్కసారిగా కిందకు జారిపడటంతో నిన్నటితో పోల్చితే 100 గ్రాముల రేటు రూ.20,800 పడిపోయింది. ఇదే క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.7,255, ముంబైలో రూ.7,167, దిల్లీలో రూ.7,182, కలకత్తాలో రూ.7,167, బెంగళూరులో రూ.7,167, కేరళలో రూ.7,167, వడోదరలో రూ.7,172, జైపూరులో రూ.7,182, నాశిక్ లో రూ.7,170, మంగళూరులో రూ.7,167, అయోధ్యలో రూ.7,182, బళ్లారిలో రూ.7,167, గురుగ్రాములో రూ.7,182 వద్ద ఉన్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6,570గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,167 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.4,500 పెరిగి రూ.96,000 వద్ద కొనసాగుతోంది.