పసిడి ప్రియులకు బిగ్‌ అలర్ట్‌.. వరుసగా తగ్గి సడెన్ షాకిచ్చిన బంగారం..

పసిడి ప్రియులకు మరోసారి బిగ్‌ అలర్ట్‌. ఎందుకంటే.. మూడు రోజుల పాటు దిగివచ్చిన బంగారం ధర నేడు ఒక్కసారిగా షాకిచ్చింది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ రివర్స్ గేర్ వేయడంతో.. అంతర్జాతీయ మార్కెట్ల బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. కాగా, గత మంగళవారం రాత్రి ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ కీలక వ్యాఖ్యలు చేయడంతో బంగారం ధరలు ఎగబాకాయి. ఇక మల్టీ కమొడిటీ ఎక్స్చేంజీలో గోల్డ్ ఫూచర్స్ జూన్ 2024 కాంట్రాక్ట్ ఎక్స్ పైరీ రేటు పెరిగింది. దీంతో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఇకపోతే అది దేశీయ మార్కెట్లపై పడింది. ముఖ్యంగా.. దేశీయంగానూ తులం ప్యూర్ గోల్డ్ రేటు ఏకంగా రూ.430 మేర పెరిగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకురూ. 2,395 స్థాయికి చేరుకుంది. దీంతో సరికొత్త రికార్డ్ సృష్టించే దిశగా పరుగులు పెడుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 29.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు రూపాయి మారకం విలువ ఈరోజు కాస్త పుంజుకుంది. ఇక డాలర్ తో పోలిస్తే ప్రస్తుతం రూ. 83.415 వద్ద అమ్ముడవుతోంది.


ఇక హైదరాబాద్ మార్కెట్లలో నేడు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత మూడు రోజుల్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు దాదాపు రూ. 900 మేర దిగివచ్చిన తులం బంగారం రేటు ఇవాళ మళ్లీ రూ. 430 మేర పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ. 73 వేల 250 స్థాయికి ఎగబాకింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ రూ.400 మేర పెరిగి రూ. 67 వేల 150 వద్దకు పెరిగింది. అలాగే బంగారంతో పాటు వెండి సైతం పోటీ పడుతూ వరుసగా రెండో రోజుల నుంచి పెరిగుతుంది. ఇక నేడు కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ. 400 మేర పెరిగి రూ. 87 వేల 600 స్థాయికి చేరింది. రెండు రోజుల్లో రూ.1100 మేర పెరగింది.