ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మీ పథకాలను అందించనుంది. డ్వాక్రా గ్రూపు సభ్యుల పిల్లల ఉన్నత విద్య, వివాహాల కోసం ఈ పథకాల ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుంది.
స్త్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు జీవనోపాధి కోసం రూ. 8 లక్షల వరకు, కుటుంబ ఖర్చుల కోసం రూ. 1 లక్ష వరకు రుణాలు పొందవచ్చు. ఈ రుణాలు 48 గంటల్లోనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. రుణగ్రహీత మరణిస్తే, స్త్రీనిధి సురక్ష యోజన కింద రుణం రద్దు చేసే వెసులుబాటు కూడా ఉంది.
































