ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ ని వినిపించింది. వారి సమస్యలను పరిష్కరించే దిశగా కీలకమైన అడుగులు వేసింది. దాంతో చాలా కాలంగా తమ సమస్యల మీద పోరాడుతున్న ఉద్యోగులకు ఇపుడు భారీ ఊరట కలుగుతోంది.
ఏడుగులు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని కూటమి ప్రభుత్వం నియమించింది. దాంతో ఈ కమిటీ ఉద్యోగుల సమస్యల మీద అధ్యయనం చేసి ఎనిమిది వారాలలోగా ప్రభుత్వానికి నివేదిక అందచేస్తుంది అని అంటున్నారు.
వైద్య సేవల కోసం :
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు దక్కాలని చాలా కాలంగా కోరుకుంటున్నారు. వీరికి ఈ హెచ్ ఎస్ ఉంది. అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అన్న మాట. దీని ద్వారా వారికి ఇప్పటిదాకా వైద్య సేవలు అందుతున్నాయి. కానీ మెరుగైన వైద్య సేవల కోసం వారు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దాంతో నాణ్యమైన వైద్య సేవలను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
చంద్రబాబు ఆదేశాలతో :
ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆయన సూచనలతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వ్యవహరిస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వమే ఏడుగురు సభ్యులను నియమించింది. వీరంతా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అందుతున్న ఈ హెచ్ ఎస్ విధానంలో వైద్యం గురించి పూర్తిగా అధ్యయనం చేస్తుంది అని అంటున్నారు ఇంతకంటే మెరుగైన సేవలు వారికి ఎలా అందించాలన్నదే ఈ కమిటీ పరిశీలన చేసి ప్రభుత్వానికి దీని మీద నివేదిక అందిస్తుంది అని అంటున్నారు. దాంతో పాటు ఉద్యోగులకు వైద్య పరంగా ఎదురవుతున్న సమస్యల మీద పూర్తి నివేదికను తయారు చేసి అందిస్తుంది అని అంటున్నారు.
వీరే సభ్యులుగా :
ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీలో సభ్యులుగా సాధారణ పరిపాలన శాఖ ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు ఉద్యోగ సంఘాల నేతలైన ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉంటారు అని అంటున్నారు. ఇక ఈ కమిటీ చేయాల్సింది మెరుగైన వైద్యం ఉద్యోగులకు అందించడం. దీంతో ఈ కమిటీ అధ్యయనం మీదనే అందరి దృష్టి ఉంది. మొత్తం మీద కీలకమైన ఒక సమస్య విషయంలో బాబు జోక్యం చేసుకుని పరిష్కరించేందుకు సిద్ధపడడం పట్ల అంతా హర్షం వ్యక్తం అవుతోంది.

































