ఏపీలో పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందుగానే

ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1, 2026 బదులుగా డిసెంబర్ 31న పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది.


ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది డిసెంబర్ 30 నాటికి నగదు ఏర్పాటు చేయాలని బ్యాంకులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించింది. డిసెంబర్ 31నే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించింది. ఒకవేళ మిగిలిపోయిన పింఛన్లను జనవరి 2న పంపిణీ చేయాలని సూచించింది.

రికార్డు స్థాయిలో పెన్షన్లు

ఏపీ ప్రభుత్వం సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే దేశంలో అధిక సామాజిక పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రంగా నిలిచింది. పెన్షన్ మొత్తాన్ని పెంచడంతో సమాజంలోని పేద, బలహీన వర్గాల కష్టాలను, ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కష్టాలను తగ్గించడానికి, గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు ఉపయోగపడుతుందని అంటోంది.

2024 జూన్ లో విడుదలైన ఉత్తర్వుల మేరకు.. వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్ జెండర్లు, డప్పు కళాకారుల సామాజిక భద్రతా పెన్షన్ల కింద నెలకు రూ.4000 అందిస్తు్న్నారు. వికలాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.6000, పూర్తి వికలాంగులకు రూ.10,000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10000 ఆర్థిక సాయం అందిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.