శబరిమల భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో అయ్యప్ప ప్రసాదం

 శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ఒక శుభవార్త. ఇకపై భక్తులు తమ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో ప్రసాదాలను బుక్ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.


ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ఇటీవల ప్రారంభించిన ‘కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్’ ద్వారా ఈ సేవలను భక్తులకు అందించనున్నారు.

ఈ సదుపాయం మొదట శబరిమల దేవాలయంలో అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత, ట్రావెన్‌కోర్ సంస్థానం పరిధిలోని 1252 దేవాలయాల ప్రసాదాలను కూడా భక్తులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. రద్దీ కారణంగా నేరుగా ఆలయానికి రాలేని భక్తులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని దేవస్వం బోర్డు తెలిపింది.

బోర్డు అధ్యక్షుడు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ ఒక నెలలోపు పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.