సీనియర్‌ సిటిజన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. 8.2 శాతం వడ్డీ రేటు అందించే సూపర్‌ స్కీమ్‌

పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) 60 ఏళ్లు పైబడిన వారికి నమ్మకమైన పెట్టుబడి. 8.2 శాతం వడ్డీ రేటు, రూ.1.5 లక్షల వరకు 80C పన్ను మినహాయింపు అందిస్తుంది. గరిష్టంగా రూ.30 లక్షల పెట్టుబడితో, ఇది స్థిరమైన త్రైమాసిక ఆదాయాన్ని, ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.

పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అనేది సీనియర్ సిటిజన్లకు నమ్మకమైన పెట్టుబడి పథకం. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు దీనిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో కనీస పెట్టుబడి మొత్తం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.30 లక్షలు పెట్టవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 రెండవ త్రైమాసికానికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.


SCSS అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, దీనిలో పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీ ప్రతి త్రైమాసికంలో పెట్టుబడిదారుడి ఖాతాకు జమ చేయబడుతుంది. ఈ మొత్తాన్ని వెంటనే ఉపయోగించవచ్చు, సీనియర్ సిటిజన్లకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది.

ఈ పథకం మెచ్యురిటీ కాలం 5 సంవత్సరాలు, కావాలనుకుంటే దీనిని మరో 3 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఏదైనా కారణం చేత, ముందస్తు ఉపసంహరణ అవసరమైతే కొంత జరిమానా కూడా విధించబడుతుంది.

ఒక సంవత్సరం ముందు ఉపసంహరణలపై వడ్డీ ఉండదు. 1, 2 సంవత్సరాల మధ్య ఉపసంహరణలకు 1.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 2 నుంచి 5 సంవత్సరాల మధ్య ఉపసంహరణలకు 1 శాతం వడ్డీ రేటు వస్తుంది.

ముఖ్యంగా భార్యాభర్తలు ఉమ్మడి ఖాతాను కూడా తెరవవచ్చు. ఇది పెట్టుబడి పరిమితి, వడ్డీ రేటు రెండింటినీ పెంచుతుంది, కుటుంబానికి ఎక్కువ ఆర్థిక భద్రతను అందిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.