నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. కేవలం ఇంటర్ అర్హతతో భారీ జీతంతో ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్ విభాగం, ట్రైనీ పైలట్ ఉద్యోగాల కోసం మే 13న రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో కేబినెట్ సెక్రటేరియట్ మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థుల నెల జీతం రూ. 1.5 లక్షలకు పైగా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి 2024 జూన్ 10 వరకు గడువు ఉంది. రిక్రూట్‌మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అర్హతలు
ఈ రిక్రూట్‌మెంట్ కోసం అప్లై చేసుకునేవారు గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో 12వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అందించిన వ్యాలీడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ లేదా హెలికాప్టర్ పైలట్ కమర్షియల్ లైసెన్స్ ఉండాలి. భారత పౌరులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయో పరిమితి
క్యాబినెట్ సెక్రటేరియట్‌లో ట్రైనీ పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయసు 30 ఏళ్లు ఉండాలి, గరిష్టంగా 40 ఏళ్లు మించకూడదు.
అప్లికేషన్ ప్రాసెస్
క్యాబినెట్ సెక్రటేరియట్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఆఫ్‌లైన్ అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. అర్హత, ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ cabsec.gov.in ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిర్ణీత ఫార్మాట్‌లో ఫారమ్ నింపాలి. దీన్ని ‘లోధి రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీసర్, న్యూఢిల్లీ-110003’ అడ్రస్‌కు పంపించాలి. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం ఎంత?
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1.52 లక్షల జీతం ఉంటుంది.
క్యాబినెట్ సెక్రటేరియట్ బాధ్యతలు
ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ సులభతరం చేసే అడ్మినిస్ట్రేషన్ పనులను క్యాబినెట్ సెక్రటేరియట్ నిర్వహిస్తుంది. ఇందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (ట్రాన్సాక్షన్ ఆప్ కమర్షియల్) రూల్స్ 1961, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (అలకేషన్ ఆఫ్ బిజినెస్) రూట్స్ 1961 రూల్స్ ఫాలో అవుతుంది. క్యాబినెట్, దాని కమిటీలకు సెక్రటేరియల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయానికి కృషి చేస్తుంది.
అలాగే మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య విభేదాలను పరిష్కరించడం, కార్యదర్శుల స్టాండింగ్, స్పెషల్ కమిటీల ద్వారా ఏకాభిప్రాయం సాధించడానికి కృషి చేయడం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను సులభతరం చేస్తుంది. పాలసీ డిసీజన్స్ కోసం అవసరమైన మద్దతు అందిస్తుంది. ఇందుకు అవసరమైన ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తుంది. తాజాగా ట్రైనీ పైలట్ పోస్టుల నియామకానికి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.