దేశంలోని యువతకు గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ

79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి దేశంలోని యువతకు తీపి కబురు చెప్పారు. ఈ మేరకు రూ.లక్ష కోట్లతో ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు.


పంద్రాగస్టు సందర్భంగా ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈసారి డబుల్ దీపావళి ఉండబోతోందని ప్రధాని కామెంట్ చేశారు. జీఎస్టీ భారాన్ని తగ్గించనున్నట్లుగా ప్రకటించారు. తద్వారా సామాన్య ప్రజలకు దీపావళి బొనాంజా ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు. దేశంలో సంస్కరణల కోసం ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు. హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి జీఎస్టీలో గణనీయమైన సంస్కరణలు తీసుకొస్తామని తెలిపారు. సామాన్యులకు ప్రయోజనం కలిగేలా.. రోజువారీ వస్తువుల ధరలు అందుబాటులోకి తీసుకొచ్చి దీపావళికి కానుకగా ఇస్తామని అన్నారు. సంస్కరణ విషయంలో దేశ ప్రజలంతా తమకు సంపూర్ణ మద్దతు పలకాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన స్కీమ్ లక్ష్యం ఇదే..

ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం అనేది ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక (Employment Linked Incentive – ELI) పథకం. ఇందులో భాగంగా దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే కేంద్ర ప్రభుత్వం ఉద్దేవం. ఈ పథకం 2025 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చి, 2027 జూలై 31 వరకు కొనసాగనుంది. రెండేళ్లలో 3.5 కోట్లకుపైగా ఉద్యోగాలను సృష్టించడం, ఇందులో 1.92 కోట్ల మంది మొదటిసారి ఉద్యోగంలో చేరేవారు ఉండనున్నారు. ఇక తయారీ రంగంపై ప్రత్యేక దృష్టితో వివిధ రంగాలలో కొత్త ఉద్యోగాలను సృష్టించనున్నారు. ఉద్యోగులు, యజమానులకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడం ద్వారా ఉపాధి సంక్షోభాన్ని అధిగమించడమే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం ముఖ్య ఉద్దేశం

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.