సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. సాధారణంగా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు (విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, విజయవాడ) ఈ రైళ్లు ఉంటాయి.
అయితే వీటి షెడ్యూల్స్, బుకింగ్స్ పండుగకు దగ్గరలో (జనవరి మొదటి వారంలో) ప్రకటిస్తుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు గుడివాడ, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్‌లో ఆగుతాయి. అలాగే మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి, కరీంనగర్, లింగంపేట్ జగిత్యాల్, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్, బాసర్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్భాని, మాన్వత్ రోడ్, పార్టూర్, జాల్నా, సి సంభాజీనగర్, లాసూర్, రోటేగావ్, నాగర్‌సోల్, మన్మాడ్, భుసావల్, ఖాండ్వా, ఇటార్సి, భోపాల్, ఉజ్జయిని తదితర స్టేషన్‌లలో స్టాప్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
పొడిగించిన ప్రత్యేక రైళ్ల తేదీలు:
- రైలు నంబర్ 07041 సికింద్రాబాద్- అనకాపల్లి – 2026 జనవరి ఆదివారాల్లో అంటే 4వ తేదీ, 11,18 తేదీల్లో ఈ ప్రత్యేక రైలును నడపనున్నారు.
- రైలు నంబర్ 07042 అనకాపల్లి- సికింద్రాబాద్- సోమవారాలు జనవరి 5,12,19 తేదీల్లో నడుస్తుంది.
- రైలు నంబర్ 07075 హైదరాబాద్- గోరక్‌పూర్ శుక్రవారాల్లో జనవరి 9,16,23 తేదీల్లో.
- రైలు నంబర్ 07076 గోరక్ పూర్ – హైదరాబాద్- ఆదివారాల్లో జనవరి 11,18,25 తేదీల్లో నడుస్తుంది.
ప్రత్యేక రైళ్లు:
- రైలు నంబర్ 07274 మచిలిపట్నం- అజ్మీర్ – 21 డిసెంబర్ 2025న ఆదివారం ప్రయాణించనుంది.
- రైలు నంబర్ 07275 అజ్మీర్-మచిలీపట్నం- డిసెంబర్ 28వ తేదీన.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికుల రద్దీని బట్టి రైళ్లను నడిపేందుకు చర్యలు చేపడతామని తెలిపింది.

































