మహిళలు, BC, SC, ST లకు శుభవార్త.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్ర అభివృద్ధే(State Development) లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇప్పటికే పలు హామీలు అమలు చేసిన విషయం తెలిసిందే.


ఇక మిగిలిన హామీలను ఈ ఏడాది అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు(Secondary food processing units) ఏర్పాటు చేసుకునే మహిళలు, బీసీ(BC), ఎస్సీ(SC), ఎస్టీ(ST), మైనార్టీ(Minority), దివ్యాంగులు(Disabled) , ట్రాన్స్‌జెండర్ల(Transgender)కు శుభవార్త చెప్పింది. వారి మూలధన పెట్టుబడి(Investment)లో భాగంగా ప్లాంటు, యంత్రాలపై రాయితీని 35 నుంచి 45 శాతానికి పెంచింది. విద్యుత్ టారిఫ్‌లోనూ ప్రోత్సాహకాలు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. MSMEలు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీలకు భూమి విలువలో 75 శాతం రాయితీ(గరిష్ఠంగా రూ.25 లక్షలు) కల్పిస్తూ మరో జీవో ఇఛ్చింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.