కేంద్రం గుడ్‌న్యూస్‌: వీరికి ఉచిత ఆరోగ్య భీమా ఇక రూ 10 లక్షలు, ఇలా చేయండి.

కేంద్రం వృద్ధులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా మొత్తాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకూ రూ.5 లక్షల ఆరోగ్య బీమాను అంది స్తున్నారు.


అయితే అర్హులైన కుటుంబాలకు ఈ బీమా కవరేజీని రూ.10 లక్షలకు పెంచారు. ఈ పథకం వినియగం.. ప్రయోజనాల పైన కేంద్రం కీలక సమాచారం వెల్లడించింది. భీమా తీసుకున్న తొలి రోజు నుంచే అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఆయుష్మాన్ భారత్.. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం భీమా కవరేజీని పెంచారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకూ రూ.5 లక్షల ఆరోగ్య బీమాను అందిస్తుండగా.. ఇప్పుడు తాజా నిర్ణయం మేరకు అర్హులైన కుటుంబాలకు ఈ బీమా కవరేజీని రూ.10 లక్షలకు పెంచారు. వయోపరిమితి 70 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేద , మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోడానికి PM-JAY పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రులలో క్యాష్‌లెస్, పేపర్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. దీని ద్వారా రూ. 10 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ లభిస్తుంది.

ఈ పథకం లబ్దిదారులకు అప్పటికే ఉన్న అన్ని వ్యాధులు మొదటి రోజు నుండే కవర్ అవుతాయి. దీర్ఘకాలిక వైద్య సమస్యలు ఉన్న కుటుంబాలు కూడా ఈ పథకం ద్వారా పూర్తి బీమా కవరేజీని పొందవచ్చు. దీనికి ఎలాంటి వయోపరిమితి, లింగ పరిమితి లేదు. ఈ పథకం దేశవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఉపయోగించగల నగదు రహిత, కాగిత రహిత రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవర్‌ను అందిస్తుంది.

ఇది ఫ్యామిలీ ఫ్లోటర్ పరిమితి నుండి వేరుగా ఉంటుంది. అటువంటి కుటుంబాలకు అందుబాటులో ఉన్న మొత్తం కవరేజీని సంవత్సరానికి రూ.10 లక్షలకు సమర్థవంతంగా పెంచుతుంది. ఆధార్ ప్రకారం 70 ఏళ్లు పైబడిన ఎవరైనా టాప్-అప్‌కు అర్హులు. ఆదాయ స్థితి పట్టింపు లేదు. మెరుగైన కవర్‌ను యాక్టివేట్ చేయడానికి, సీనియర్ సిటిజన్ ఆధార్ eKYCని మళ్ళీ పూర్తి చేయాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.