రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి అకౌంట్లలోకి డబ్బులు

ఒక్కో చెట్టుకు 1000 రూపాయల చొప్పున 1330 రైతులకు ఏకంగా 2.3 కోట్ల రూపాయలు సాయం చేసింది. కోనసీమలో 850 హెక్టార్లలో 23 వేలకు పైగా కొబ్బరి చెట్లకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. తాజాగా వారి అకౌంట్లలో డబ్బులు పడ్డాయి.


దేశానికి వెన్నెముక లాంటి రైతులకు కష్టాలు తప్పటం లేదు. ఏ పంట వేసినా పెద్దగా రాబడి ఉండటం లేదు. నష్టాలు తప్ప లాభాలు రావటం లేదు. ఏదో ఒక కారణంతో అన్నదాతలకు కన్నీళ్లు మిగులుతున్నాయి. ఇలాంటి సమయంలో రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి. రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తున్నాయి. పంట నష్టం వచ్చినపుడు కూడా ముందుండి మరీ సాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొబ్బరి రైతులకు శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినట్లు తెలిపింది. కొబ్బరి రైతుల కోసం ఏర్పాటు చేసిన పథకం కింద వారికి సాయం అందించింది.

ప్రస్తుతం ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటల పునరుద్దరణ స్కీమ్ అమలులో ఉంది. ఈ పథకం కేవలం కొబ్బరి రైతుల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడింది. నష్టపోయిన కొబ్బరి రైతులకు ప్రభుత్వం ఈ పథకం కింద సాయం అందిస్తుంది. చనిపోయిన కొబ్బరి రేట్లు, కాయలు కాయని చెట్లకు ప్రభుత్వం డబ్బుల ఇస్తుంది. గతేడాది మే, జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన, కాయలు కాయని చెట్లను ఉద్యానవన శాఖ గుర్తించింది. రైతుల పేర్లు నమోదు చేసుకుంది. నష్టపోయిన ఆ రైతులకు ఆర్థిక సాయం కింద కొంత డబ్బు వారి అకౌంట్లలో పడింది. ప్రభుత్వం ఒక్కో చెట్టుకు 1000 రూపాయలు సాయం చేసింది. కోనసీమలో 850 హెక్టార్లలో 23 వేలకు పైగా కొబ్బరి చెట్లకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది.

1330 రైతులకు ఏకంగా 2.3 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో జమ అయ్యాయి. కోనసీమ రైతులు తప్పని సరిగా కొబ్బరి చెట్ల పునరుద్ధరణ స్కీమును వినియోగించుకోవాలని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. హెక్టారుకు 32 చెట్లకు పరిహారం అందిస్తామని అన్నారు. ఇక, ఈ పథకం ప్రతి ఐదేళ్లకు ఒకసారి మాత్రమే అమలు చేస్తారు. ఒకసారి ఈ పథకం కింద లబ్ధి పొందితే.. తర్వాత సంవత్సరం ఈ పథకం వారికి వర్తించదు. సాధారణంగా కొబ్బరి చెట్లు ప్రదేశం అనుకూలతను బట్టి 60 నుంచి 100 సంవత్సరాల వరకు బతుకు తాయి. చెట్ల రకం బట్టి 3 నుంచి 5 సంవత్సరాల్లో కాయలు కాయటం మొదలవుతుంది. ఒక చెట్టు సంవత్సరానికి 75 కాయల్ని కాస్తుంది. కొన్ని చెట్లు వంద అడుగులు పైనే పెరుగుతాయి.