హార్ట్ ఎటాక్ బాధితులకు గవర్నమెంట్ గుడ్ న్యూస్.

దేశంలో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. అలాగే ఆరోగ్య సమస్యలు సైతం అదే రీతిలో పెరుగుతున్నాయి. బీపీ, షుగర్‌తోపాటు హార్ట్ ఎటాక్ సమస్య ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో ఇబ్బందికి గురి చేస్తోంది.


బీపీ, షుగర్ సమస్యలుంటే.. రోజు మందులు వేసుకోవచ్చు. కానీ హార్ట్ ఎటాక్ వస్తే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతామనే భయం ఒక వైపు ఉంటే.. ఆసుపత్రిలో చేరితే లక్షలకు లక్షల రూపాయిలు ఖర్చవుతాయని ఆందోళన మరో వైపు ఉంటుంది.

అలాంటి వేళ.. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో దాదాపు రూ. 50,000 ఖరీదు చేసే అత్యంత ఖరీదైన గుండెపోటు ఇంజెక్షన్‌.. టెనెక్టెప్లేస్, స్ట్రెప్టకినేస్ ( క్లాట్ బస్టర్ )ను ఇప్పుడు ఉచితంగా అందిస్తున్నారు. గుండెపోటు వచ్చిన 90 నిమిషాల్లోపు అంటే.. గంటన్నర లోపు ఈ చికిత్స అందిస్తే.. ఆ వ్యక్తి మరణం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రులు,కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటాయి. హార్ట్ ఎటాక్ వచ్చిన సమయంలో ఈ ఇంజెక్షన్‌ను కొనుగోలు చేసేందుకు పేద, మధ్యతరగతి ప్రజలు స్తోమత లేకుండా ఉంటుంది. దీంతో పలువురు వ్యక్తులు హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్నారు. ఇలాంటి వారి ప్రాణాలను సైతం కాపాడడమే లక్ష్యంగా యోగి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉంటుంది.

గోల్డెన్ అవర్ అంటే..

హార్ట్ ఎటాక్ అంటే.. గుండెకు రక్తాన్ని సరఫరా చేస ధమనుల్లో రక్తం గడ్డకట్టడం. అది ఆక్సిజన్ అందకుండా నిరోధిస్తుంది. ఈ సమస్య ఉత్పన్నమైన మొదటి 90 నిమిషాలను వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయం లోపు చికిత్స అందితేనే గుండె కండరం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో.. సామాన్యుడికి సైతం ఈ తక్కువ సమయంలో కార్పొరేట్ స్థాయి చికిత్స లభించేలా చూడడమే లక్ష్యం.

ఈ ఇంజెక్షన్ ఎలా పని చేస్తోందంటే..?

ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే టెనెక్టెప్లెస్, స్ట్రెప్టోకినేస్ ఇంజెక్షన్లు సాధారణ పరిభాషలో థ్రోంబోలిటిక్ డ్రగ్స్ లేదా క్లాట్ బస్టర్స్ అని పిలుస్తరు. ఇవి రక్తనాళల్లో మూసుకుపోయిన రక్తం గడ్డకట్టడాన్ని త్వరగా కరిగిస్తాయి. దీనివల్ల గుండెకు రక్త ప్రవాహం వెంటనే ప్రారంభమవుతుంది. ఈ ఇంజెక్షన్ గోల్డెన్ అవర్ సమయంలో ఇస్తే.. మరణ ప్రమాదాన్ని 30 నుంచి 40 శాతం తగ్గించవచ్చని వైద్యులు అంటున్నారు. ఇది వేలాది మంది ప్రాణాలను కాపాడుతుంది. సూపర స్పెషాలిటీ ఆసుపత్రులు లేని గ్రామాల్లో సైతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కూడా హార్ట ఎటాక్ వచ్చిన వ్యక్తి ప్రాణాలను సైతం నిలుపుకోవచ్చు. అందుకోసం యోగి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఆసుపత్రిలో చికిత్స ఇలా..

హార్ట్ ఎటాక్ వచ్చిన రోగి ఆసుపత్రికి వెళ్లినప్పుడు వైద్యలు ఏమి చేయాలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించింది. మొదట ఎవరికైనా గుండెపోటు లక్షణాలు కనిపిస్తే.. వారు వెంటనే వ్యాధిని నిర్ధారించడానికి ఈసీజీ చేస్తారు. అనంతరం ఇది గుండెపోటు అని నిర్ధారించబడిన వెంటనే.. విధుల్లో ఉన్న వైద్యుడు ఉచితంగా ఇంజెక్షన్ ఇస్తారు. రోగి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటే.. ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని వారు సూచిస్తారు. ఇది సమయాన్ని ఆదా చేయడంతోపాటు ప్రాథమిక చికిత్స అందించినట్లు అవుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.