PF ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్

ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund) కస్టమర్లకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులకు స్వస్తిపలకాలని భావించి నేపథ్యంలో కీలక ముందడుగు వేసింది.


పీఎఫ్ ఖాతాదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త సంవత్సరం నుంచి పని విధానంలో పెద్ద మార్పులు తీసుకురానుంది.

ప్రావిడెంట్ ఫండ్ (PF) కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించింది. ఇప్పటికే డిజిటలైజేషన్ ద్వారా పీఎఫ్ సేవలను సులభతరం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు EPFO కార్యాలయాల పని విధానంలోనే పెద్ద మార్పులు తీసుకురానుంది. పీఎఫ్ ఖాతాదారులు తమ సమస్యల పరిష్కారం కోసం కచ్చితంగా తమ యజమాని అనుబంధిత ప్రాంతీయ EPFO కార్యాలయానికే వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు వాటి పరిష్కారం వైపు అడుగులు పడుతున్నాయి.

ఇకపై EPFO కార్యాలయాలు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల (Passport Seva Kendra) తరహాలో పనిచేయనున్నాయి. ఉద్యోగం మారినప్పుడు లేదా వేరే రాష్ట్రానికి మారినప్పుడు ఉద్యోగులకు పీఎఫ్ సమస్యలు ఎక్కువగా ఉండేవి. కొత్త విధానం అమలులోకి వస్తే, ఖాతాదారు దేశంలోని ఏ EPFO కార్యాలయానికైనా వెళ్లి తన సమస్యను పరిష్కరించుకోవచ్చు. అన్ని సేవలు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అనుసంధానమవుతాయి. దీంతో క్లెయిమ్‌లు, KYC ధృవీకరణ, ఖాతా బదిలీ వంటి ప్రక్రియలు వేగంగా పూర్తవుతాయి.

సింగిల్ విండో సర్వీస్ సెంటర్లు

ఈ విధానానికి సంబంధించిన ట్రయల్ ఇప్పటికే ఢిల్లీలో ప్రారంభమైందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశ రాజధానిలో EPFO కొత్త ప్రావిడెంట్ ఫండ్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా మాండవీయ ఈ ప్రకటన చేశఆరు. దేశవ్యాప్తంగా ఉన్న EPFO కార్యాలయాలను సింగిల్ విండో సర్వీస్ సెంటర్లుగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

సర్వీస్ ప్రొవైడర్లను నియామకం

డిజిటల్ విధానంతో పని చేయడంలో ఇబ్బంది పడే ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా EPF సర్వీస్ ప్రొవైడర్లను నియమించడానికి సిద్ధమైంది. వీరు పీఎఫ్ ఖాతాదారులకు గైడ్ చేస్తూ, క్లెయిమ్ లు అప్లై చేసుకోవడం, KYC పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. ఇకపై ఏజెంట్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, అధికారికంగా వీరే ఈ సేవలు అందించనున్నారు. విదేశాల్లో ఉన్న వారికి దీనిద్వార ఎంతో మేలు చేకూరుతుంది. విదేశాల్లో ఉద్యోగ సమయంలో కట్ అయిన పీఎఫ్ డబ్బు ఇక కోల్పోయే ప్రమాదం ఉండదు. వారు భారత్‌కు తిరిగివచ్చిన తర్వాత తమ పీఎఫ్ మొత్తాన్ని సులభంగా విత్ డ్రా చేసుకోవచ్చు.

KYC సమస్యలకు స్వస్తి..

చాలా మంది ఉద్యోగుల పీఎఫ్ డబ్బు KYC సమస్యల కారణంగా సంవత్సరాల తరబడి నిలిచిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మిషన్ మోడ్‌లో KYC ధృవీకరణ చేపట్టనుంది. అర్హులైన ఖాతాదారులను గుర్తించి, వారి డబ్బును వారికి లేదా వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సింపుల్ గా చెప్పాలంటే EPFOలో ఈ మార్పులు అమలులోకి వస్తే పీఎఫ్ ఖాతాదారులకు సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.