ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి సర్కార్ షెడ్యూల్డ్ కులాల వారికి శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా గతంలో తీసుకున్న రుణాల పైన వడ్డీని పూర్తిగా మాఫీ చేయాలని నిర్ణయించింది.
నేడు జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో ఈ కీలక నిర్ణయంతో పాటు అనేక అంశాలకు సంబంధించి ఆమోదాన్ని ఇచ్చింది క్యాబినెట్.
వారికి ఏపీ ప్రభుత్వం బిగ్ రిలీఫ్
మౌలిక సదుపాయాల కల్పన తో పాటు సంక్షేమం, పరిపాలన సంస్కరణలు, ప్రజాసేవలో మెరుగుదలకు సంబంధించి అనేక ప్లాన్స్ ను ఖరారు చేసింది. ఇక నేడు ఎస్సీల కోసం తీసుకున్న నిర్ణయం లో భాగంగా ఇప్పటివరకు వారు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా తీసుకున్న రుణాల పైన వడ్డీని మాఫీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో 11479 మంది ఎస్సీ లబ్ధిదారులకు వడ్డీ భారం తొలగిపోయింది.
వారికి రూట్ క్లియర్ చేసిన ఏపీ సర్కార్
ఈ చర్యతో నేషనల్ షెడ్యూల్డ్ కులాల ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కొత్త రుణాలు పొందే వారికి మార్గం సుగమమైంది. వడ్డీ మాఫీతో వారు రుణాల చెల్లింపుకు రూట్ క్లియర్ అయ్యింది..
వారికి ఆర్ధిక భారం తొలగించే నిర్ణయం
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అందించడం మాత్రమే కాకుండా, వారికి ఆర్థిక భరోసా కల్పించేలా, వారి పైన ఉన్న ఆర్థిక భారాన్ని తొలగించేలా అనేక నిర్ణయాలను తీసుకుంటున్న ఏపీ సర్కార్ అందులో భాగంగానే తాజా శుభవార్త చెప్పింది. ఇక ఇదే సమయంలో రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు ప్రాజెక్టుల కోసం నాబార్డ్ నుంచి 738 కోట్ల రుణం తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్ర పురోభివృద్ధికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల డీఏ, డీఆర్ లలో 3.64 శాతం పెంపుదలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇలా అనేక కీలక నిర్ణయాలను తీసుకున్న ఏపీ క్యాబినెట్ రాష్ట్ర పురోభివృద్ధికి దోహదం చేసే అనేక నిర్ణయాలకు పచ్చ జెండా ఊపింది. ఇక ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయటంతో ఎస్సీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తమకు ఆర్ధిక భారాన్ని తగ్గించటం శుభ పరిణామం అని వారు అభిప్రాయపడుతున్నారు.


































