Hair Fall:జుట్టు ఊడిపోతుందా….. నో ప్రోబ్లం…ఈ టిప్స్ ఫాలో అయితే సరి

HAir Fall Home Remedies:జుట్టు మన అందాన్ని రెట్టింపు చేస్తుందన్న విషయాన్నీ అందరు అంగీకరించాలి. అందమైన జుట్టును సొంతం చేసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జుట్టును ఎంత జాగ్రత్తగా చూసుకున్న,ఎంత పోషణ చేసిన ఊడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. జుట్టు అలా ఊడిపోకుండా ఉండాలంటే ఈ క్రింది చిట్కాలను పాటించండి.


1. ఉసిరికాయను ముక్కముక్కలుగా చేసుకొని బాగా ఎండబెట్టాలి. ఎండిన ఈ ముక్కలను కొబ్బరి నూనెలో వేడి చేసి ఒక రాత్రి అంతా ఉసిరి ముక్కలను నూనెలో ఉంచాలి. మరుసటి రోజు ఆ ముక్కలను తీసి వేసి ఆ నూనెను తలకు రాసుకోవాలి. ఈ నూనెను క్రమం తప్పకుండా రాసుకుంటే జుట్టు ఊడిపోవటం అనేది తగ్గి జుట్టు వత్తుగా,బలంగా,పొడవుగా పెరుగుతుంది.
2. ప్రతి రోజు కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి రాసుకుంటే మంచి నిగారింపు వచ్చు జుట్టు ఊడటం క్రమేపి తగ్గుతుంది.
3. కొత్తిమీర రసాన్ని తలకు పట్టించి ఒక అరగంట అయిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు ఊడ టాన్ని నిరోదించవచ్చు.
4. నిమ్మకాయ గింజలు,మిరియాలు కలిపి ముద్దగా చేసుకొని తలకు బాగా పట్టించి బాగా అరిన తర్వాత తలస్నానం చేయాలి.
5. పెసలు ఉడికించి ముద్దగా చేసి దానిలో మెంతులపొడి కలిపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.
6. వంద గ్రాముల పెరుగులో ఒక గ్రాము మిరియాల పొడి కలిపి తలకు బాగా అప్ట్టించి ఆరిన తర్వాత స్నానం చేయాలి.
7. ప్రతి రోజు బాదం నూనెతో జుట్టు కుదుళ్ళ నుండి రెండు మూడు సార్లు మర్దన చేయాలి. ఈ విధంగా చేయుట వలన జుట్టు ఊడటం కొంతవరకు తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.