జుట్టు రాలడం + చుండ్రు + తలపై దురద.. మూడింటికీ ఒక్క గుప్పెడు ఆకు చాలు.. ఎలా వాడాలో తెలుసుకోండి

జుట్టు రాలడం + చుండ్రు + తలపై దురద.. మూడింటికీ ఒక్క గుప్పెడు ఆకు చాలు.. ఎలా వాడాలో తెలుసుకోండి.. ఈ రోజుల్లో జుట్టు సమస్యలు ఎవరినీ వదలడం లేదు.


ఒకవైపు జుట్టు రాలిపోతూ బట్టతల భయం, మరోవైపు చుండ్రు – దురదతో తల పగిలేలా ఉంటుంది. చలికాలం వచ్చిందంటే ఈ సమస్యలు మరింత పెరిగిపోతాయి.

కానీ ఇంతకీ ముందు మీ ఇంటి వెనకావరణంలోనే ఉన్న గోరింటాకు ఈ మూడు సమస్యల్ని ఒకేసారి పరిష్కరించగలదని తెలుసా?
ప్రముఖ న్యూట్రిషనిస్ట్ & డైటీషియన్ శ్రేయా గోయల్ (Instagram: @dietician_shreya) తన తాజా రీల్‌లో ఈ అద్భుత హోమ్ రెమెడీని షేర్ చేశారు.

గోరింటాకు జుట్టుకు ఎందుకంత మంచిది?
యాంటీ-ఫంగల్ & యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు → చుండ్రుకి కారణమైన ఫంగస్‌ను చంపుతుంది. తల చర్మాన్ని చల్లబరుస్తుంది → దురద, చికాకు తగ్గుతాయి. రక్త ప్రసరణ పెంచుతుంది → జుట్టు మూలాలు బలపడతాయి, రాలడం తగ్గుతుంది. సహజ కండీషనర్‌లా పనిచేస్తుంది → జుట్టు మృదువుగా, మెరిసేలా చేస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

ఎలా తయారు చేసుకోవాలి? (5 నిమిషాల్లో రెడీ!)
ఒక గుప్పెడు (20-25) తాజా గోరింటాకులు తీసుకోండి. శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో 2-3 గ్లాసుల నీళ్లు పోసి ఆకులు వేయండి. మీడియం ఫ్లేమ్‌పై 10-15 నిమిషాలు మరిగించండి (నీళ్లు లేత ఎరుపు రంగులోకి మారతాయి). స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. గుడ్డ వడకట్టి, ఆ నీళ్లను ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకోండి (ఫ్రిజ్‌లో 4-5 రోజుల వరకు పనికొస్తుంది)

ఎలా వాడాలి?
షాంపూ చేసిన తర్వాత లాస్ట్ రిన్స్‌కి ఈ గోరింటాకు నీళ్లను ఉపయోగించండి.తలకు బాగా పోసి, మూలాల నుంచి కొసల వరకు మసాజ్ చేయండి. టవల్‌తో తుడుచుకోండి (పూర్తిగా డ్రై చేయాల్సిన అవసరం లేదు)

వారంలో 2-3 సార్లు ఉపయోగిస్తే
→ 10-15 రోజుల్లోనే చుండ్రు గణనీయంగా తగ్గుతుంది
→ జుట్టు రాలడం ఆగుతుంది
→ తల దురద పూర్తిగా మాయమవుతుంది

ముఖ్య గమనిక:
గోరింటాకు చాలా మందికి సేఫ్ అయినప్పటికీ, మొదటిసారి వాడేముందు చిన్న ప్యాచ్ టెస్ట్ (చేయి మీద) చేసుకోండి. ఏదైనా అలెర్జీ, ఎర్రబడడం కనిపిస్తే వాడకూడదు. తీవ్రమైన చుండ్రు/జుట్టు రాలిపోవడం ఉంటే డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం.ఇంట్లోనే ఉన్న గోరింటాకుతో ఇంత సులువుగా జుట్టు సమస్యలు పరిష్కారమవుతాయంటే… ఈ రోజు నుంచే ట్రై చేయండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.