మీ పాత ఫోన్ స్లో అయ్యిందా?

మీ పాత ఫోన్ స్లో అయ్యిందా? ఈ చిన్న పని చేస్తే.. కొత్త ఫోన్‌లా రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది.. ఫోన్ వాడగా వాడగా స్లో అవ్వడం కామన్.


యాప్స్ ఓపెన్ అవ్వడానికి టైమ్ తీసుకుంటున్నాయా? అయితే ‘డెవలపర్ ఆప్షన్స్’లో ఈ మార్పు చేయండి.

మీ ఫోన్ Settings లోకి వెళ్లి About Phone మీద క్లిక్ చేయండి.

అక్కడ Build Number కనిపిస్తుంది. దానిమీద 7 సార్లు వరసగా ట్యాప్ చేయండి. “You are now a developer” అని వస్తుంది.

ఇప్పుడు వెనక్కి వచ్చి Settings > System > Developer Options లోకి వెళ్లండి.

కిందకి స్క్రోల్ చేస్తే Window animation scale, Transition animation scale, Animator duration scale అని మూడు ఆప్షన్స్ ఉంటాయి.

వీటిని 1x నుంచి 0.5x కి మార్చండి లేదా పూర్తిగా OFF చేయండి.

ఇప్పుడు చూడండి.. మీ ఫోన్ ఎంత ఫాస్ట్‌గా పనిచేస్తుందో మీకే అర్థమవుతుంది!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.