మీ ఆధార్ కార్డు ఎక్కడైనా పోయినా, మీ వ్యక్తిగత సమాచారం యూఐడీఏఐ (UIDAI) డేటాబేస్‌లో పూర్తిగా సురక్షితంగానే ఉంటుంది. మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే, యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ‘Lost or Forgotten EID/UID’ సేవ ద్వారా ఆధార్ నంబర్‌ను తిరిగి పొందవచ్చు.
PDF ఫైల్‌గా డౌన్‌లోడ్
వివరాలను నమోదు చేసిన తర్వాత ఆధార్ నంబర్ మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు SMS రూపంలో వస్తుంది. ఆధార్ నంబర్ లభించిన అనంతరం ‘Download Aadhaar’ ఆప్షన్‌ను ఉపయోగించి మీ ఇ-ఆధార్‌ను PDF ఫైల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ PDF ఫైల్‌ను ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం ఉంటుంది. పాస్‌వర్డ్‌గా మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలను పెద్ద అక్షరాలలో టైప్ చేసి, ఆ వెంటనే మీ పుట్టిన సంవత్సరాన్ని జత చేయాలి.
మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి లేకపోతే, సమీప ఆధార్ సేవా కేంద్రాన్ని (Aadhaar Seva Kendra) సందర్శించి బయోమెట్రిక్ ద్వారా మీ ఆధార్ వివరాలను తిరిగి పొందవచ్చు.
మీ ఆధార్ డేటా భద్రతపై ఎటువంటి సందేహం అవసరం లేదని UIDAI స్పష్టం చేస్తోంది.




































