స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం!
పర్మనెంట్ అకౌంట్ నెంబర్(PAN)ను ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. బ్యాంకు ట్రాన్సాక్షన్లు వంటి ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు చాలా అవసరం. పాన్ కార్డు ఒక గుర్తింపు కార్డు వలె కూడా పనిచేస్తుంది. టాక్స్ పేమెంట్స్, ఆర్థిక లావాదేవీలకు పాన్ తప్పనిసరి. పాన్ నంబర్‌లో ఇంగ్లీష్ అక్షరాలు, అంకెల కలిసి ఉంటాయి. బ్యాంకుల్లో లేదా ఆర్థిక సంస్థలో డిపాజిట్ చేసే సందర్భంలో, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్, డెబిట్ కార్డులు, రుణాలకు దరఖాస్తు చేసే సమయంలో , కంపెనీ షేర్లు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్ ఇలా చాలా సందర్భాల్లో పాన్ కార్డు తప్పనిసరి.
పాన్ కార్డు పోయినప్పుడు ఏం చేయాలి?
మీ పాన్ కార్డు పోయినా లేదా దొంగింలించ బడినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి, దీని వలన మీ పాన్ కార్డు దుర్వినియోగం జరగడాన్ని కొంతమేర తగ్గించవచ్చు. డూప్లికేట్ పాన్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే పోలీస్ రిపోర్ట్ కూడా అవసరం ఉంటుంది.
డూప్లికేట్ పాన్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
NSDL అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి, అందులో డూప్లికేట్ పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలి, పాన్ కార్డు నంబర్, ఆధార్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి డూప్లికేట్ పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఓటీపీ సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్‌మిషన్ తర్వాత మీ అడ్రస్, పిన్ కోడ్ వంటి వివరాలను ధృవీకరించుకోవాలి. మీ పాన్ కార్డుకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపించబడుతుంది. ఓటీపీని వెరిపై చేసి, ఆన్‌లైన్ ద్వారా రూ.50 చెల్లించి ప్రాసెస్ పూర్తిచేయాలి. డూప్లికేట్ పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ కేటాయించబడుతుంది. దీని ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చు.
































