టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాడు. అతని భార్య నమ్రత ఈ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో తన కూతురు సితారలాగే మహేష్ కూడా ఓ రెడ్ టీషర్ట్ లో స్టైలిష్ గా కనిపించాడు.
వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు క్రిస్మస్ పండుగ కోసం చిన్న బ్రేక్ తీసుకున్నాడు. భార్య నమ్రత, కూతురు సితార, కొడుకు గౌతమ్, సన్నిహితులతో కలిసి అతడు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్ క్రిస్మస్ సెలబ్రేషన్స్
రాజమౌళితో కలిసి వారణాసి మూవీలో బిజీగా ఉన్నా కూడా.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట క్రిస్మస్ సందడి నెలకొంది. తన కుటుంబం, స్నేహితులతో కలిసి అతడు ఈ పండుగను ఆనందంగా జరుపుకున్నాడు. శుక్రవారం (డిసెంబర్ 25) నాడు నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది.
ఫ్యామిలీ ఫోటో అదిరింది
మహేష్ బాబు ఎప్పటిలాగే సింపుల్ అండ్ స్టైలిష్‌గా ఎరుపు రంగు టీ-షర్ట్, జీన్స్‌లో కనిపించగా.. నమ్రత నలుపు రంగు దుస్తుల్లో మెరిశారు. కూతురు సితార ఎరుపు రంగు డ్రెస్సులో క్యూట్‌గా నవ్వుతూ ఆకర్షణగా నిలిచింది. అటు గౌతమ్ కూడా మెరూన్ కలర్ టీషర్ట్ లో కనిపించాడు.
వెనుక అందంగా అలంకరించిన క్రిస్మస్ ట్రీ, రంగు రంగుల లైట్ల వెలుగుల్లో మహేష్ ఇల్లు మెరిసిపోతోంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ నమ్రత “ది బిగ్ సెలబ్రేషన్ ఫ్యామిలీ” అని రాసుకొచ్చింది. అలాగే ఫ్రెండ్స్‌తో దిగిన సెల్ఫీలను కూడా పోస్ట్ చేసింది.
ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా
ఈ ఫోటోలు చూసిన అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. “పండుగ కళ అంటే ఇదే.. ఫ్యామిలీ అంతా ఎంత బాగున్నారో” అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో కామెంట్స్ పెడుతున్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ ఇప్పటికే సంచలనం సృష్టించగా.. 2027 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది.
ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కు వస్తానని అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ కూడా చెప్పిన విషయం తెలిసిందే. మరోర ఏడెనిమిది నెలల్లో మూవీ షూటింగ్ పూర్తవుతుందని కామెరాన్ తో రాజమౌళి చెప్పాడు. ఈ సినిమా కోసం మహేష్ కొన్ని యుద్ధ కళలను కూడా నేర్చుకుంటున్నట్లు ఈ మధ్యే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


































