మిక్స్‌డ్‌ చుడువా : ఇలా ట్రై చేయండి

www.mannamweb.com


బరువు తగ్గాలనుకునేవారికి, ఈజీగా ఏదైన స్నాక్‌ చేయానుకునేవారికి బెస్ట్‌ ఆప్షన్‌ మిక్స్‌డ్‌ చుడువా. ఒకసారి చేసుకుని నిల్వ ఉంచుకుని కూడా వినియోగించుకోచ్చు.

మరి అలాంటి హెల్దీ అంట్‌ టేస్టీ మిక్స్‌డ్‌ చుడువాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి!

కావలసినవి: మఖానా- కప్పు; జీడిపప్పు- కప్పు; బాదం పలుకులు- కప్పు అటుకులు – కప్పు; కిస్‌మిస్‌- కప్పు; ఎండు కొబ్బరి పలుకులు- కప్పు; వేరుశనగపప్పు- కప్పు; గుమ్మడి గింజలు – అర కప్పు; కరివేపాకు- 2 రెమ్మలు; నల్ల ఉప్పు – చిటికెడు; ఉప్పు- అర టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి; జీలకర్ర పొడి- టేబుల్‌ స్పూన్‌; ఆమ్‌చూర్‌ పౌడర్‌- అర టీ స్పూన్‌; చక్కెర పొడి- టేబుల్‌ స్పూన్‌; నూనె- 2 టీ స్పూన్‌లు.

తయారీ:
మఖానీ, జీడిపప్పు, బాదం, వేరుశనగపప్పు, గుమ్మడి గింజలను విడివిడిగా నూనె లేకుండా మందపాటి బాణలిలో దోరగా వేయించాలి. బాణలిలో నూనె వేడి చేసి ఎండుకొబ్బరి, అటుకులను వేయించాలి. అవి వేగిన తరవాత అందులో కరివేపాకు, ఉప్పు, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్ పౌడర్‌ కిస్‌మిస్, చక్కెర పొడి వేసి కలపాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న గింజలన్నింటినీ వేసి సమంగా కలిసే వరకు కలపాలి.

పోషకాలు: వందగ్రాముల మిశ్రమంలో…
∙కేలరీలు- 480
ప్రొఒటీన్‌- 10 గ్రాములు
∙కార్బొహైడ్రేట్‌లు – 35 గ్రాములు
∙ఫ్యాట్‌ – 35 గ్రాములు
∙ఫైబర్‌ – 6 గ్రాములు
∙ఐరన్‌ – 2.5 గ్రాములు
∙క్యాల్షియమ్‌ – 50మిల్లీగ్రాములు
∙విటమిన్‌ ఈ- 3 మిల్లీగ్రాములు
మఖానాలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. గుమ్మడి గింజల్లో జింక్, మెగ్నీషియం ఉంటాయి. నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఈ, బీ6 వంటి విటమిన్‌లు ఉంటాయి. ఇవన్నీ దేహక్రియలను మెరుగుపరచడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.