భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు బంద్‌

 పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పుట్టిన అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెందుతోంది. బలమైన రుతుపవన గాలులు తోడవడంతో మరికొద్ది గంటల్లోనే బలపడి తీవ్ర ప్రభావం చూపించనుంది.


ఈనెల 19న తీరం దాటుతుందని అంచనా వేస్తుండగా.. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉదయం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి,కోనసీమ, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. విశాఖ నగరంలో విడతలు విడతలుగా అతి భారీ వర్షం కుమ్మేస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై వర్షం నుంచి ఉదృతంగా ప్రవహిస్తోంది. బీచ్ రోడ్డులో ఎర్రటి నీరు ముంచెత్తింది. సముద్రం సైతం రెడ్ కలర్లో కి మారిపోయింది. జ్ఞానాపురం, ఇసుక తోట, KRM కాలనీ, వన్ టౌన్ ఏరియాలోని కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో మూడు రోజులు ఇదే వాతావరణం కొనసాగుతూ అత్యంత భారీ వర్షాలు నమోదు హెచ్చరికలు ఉన్నాయి. దీంతో జీవీఎంసీ పార్టీ స్థాయి సన్నద్ధత తో పనిచేస్తోంది. తీరం దాటిన తర్వాత వాయుగుండం అధిక ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలకు ఆస్కారం వుంది

ఇక, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు ,కృష్ణ బాపట్ల, పల్నాడు ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యాయి. కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో ఎల్లో బులెటిన్ హెచ్చరికలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కొద్ది గంటల వ్యవధిలోనే 11 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం అలజడి సృష్టిస్తోంది. బలమైన కెరటాలు ఎగిసిపడుతున్నాయి. తీరం వెంబడి, అవతల 40 నుంచి 50కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో 60కి.మీ గరిష్ఠ వేగం వుంటుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లోనూ 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వర్షాలు కారణంగా భూగర్భ జలాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు విస్తారంగా నమోదైతే ఫ్లాష్ ఫ్లడ్స్ వంటి ప్రమాదం ఉంటుంది.

అయితే, భారీ వర్షాల నేపథ్యంలో నేడు విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్లు.. భారీ వర్షాల దృష్ట్యా సెలవులు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, తూగో, పగో, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు..

తూర్పుగోదావరి జిల్లా నేడు భారీ వర్షాల కారణంగా జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు అని ప్రకటించారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి.. ఈ సెలవు రోజుకు బదులుగా రాబోయే తదుపరి సెలవు దినాన పాఠశాల పని చేయాల్సి ఉంటుందని తెలిపారు.. శిథిలావస్థలోని భవనాలు, వరండాలలో తరగతులు నిర్వహించరాదని హెచ్చరికలు జారీ చేశారు.. ఇక, భారీ వర్ష సూచనతో జిల్లాలో విద్యా సంస్థలకి సెలవు ప్రకటించిన కాకినాడ కలెక్టర్.. కలెక్టరేట్ లో ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ లో పర్యవేక్షణ చేయడానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.. మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తం గా విస్తారంగా కురుస్తున్న వర్షాలు కురుస్తు్న్నాయి.. పూర్తిగా అప్రమత్తం ఆయన జిల్లా అధికార యంత్రాంగం. వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.